ఆ ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు విఫలమవ్వలేదు...: విజయసాయి రెడ్డి

Arun Kumar P   | Asianet News
Published : Jun 19, 2020, 11:05 AM ISTUpdated : Jun 19, 2020, 11:16 AM IST
ఆ ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు విఫలమవ్వలేదు...: విజయసాయి రెడ్డి

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ఆయన మీడియాను మేనేజ్ చేయడంలో దిట్ట అని... దీన్ని మరోసారి ఉపయోగించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.   

''రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు.  కానీ మీడియా మేనేజ్మెంట్ లో మాత్రం కాదు. ప్రస్తుతం కాగ్ నివేదికను అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేయాలని చూస్తున్నాడు. కానీ అతడి హయాంలోనే భారీగా అప్పులు చేసి రాష్ట్రాన్ని సుడిగుండంలోకి  నెట్టిన విషయం గుర్తుంచుకోవాలి. తెచ్చిన అప్పులన్ని రాష్ట్రానికి అవసరం లేని, ఫలితాలివ్వని వాటిపై ఖర్చు చేశారు. అందుకు ఇప్పుడు రాష్ట్రం చెల్లించుకోవాల్సి వస్తోంది'' అంటూ ట్విట్టర్ వేదికన చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. 

read more   టేస్టీ ఫుడ్ మాలోకం, తాడిపత్రికి అందుకే....లోకేష్ పై విజయసాయి సెటైర్లు

ఇదివరకే ట్విట్టర్ వేదికగా తనదైన స్టైల్ లో లోకేష్ పై విజయసాయి రెడ్డి  పంచులు విసిరిన విషయ తెలిసిందే. నారా లోకేష్ తిండి ప్రియుడంటూ తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారంటూ ఆయన ట్వీట్ చేసారు. 

 "తాడిపత్రి వచ్చి ఏం ఇరగదీశాడని ఆ పార్టీ కార్యకర్తలే విసుక్కుంటున్నారంట. 16 రకాల వంటకాలు చేయించుకుని సుష్టిగా భోంచేసి చెక్కేశాడని తెలుగు తమ్ముళ్లు తిట్టుకుంటున్నారు. పేరుకే పరామర్శలు, పలకరింపులు. టేస్టీ ఫుడ్ దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళ్లొస్తాడు మాలోకం." అంటూ ట్వీట్ చేసారు. 

 
 

PREV
click me!

Recommended Stories

Perni Nani comments on Chandrababu: చంద్రబాబు, పవన్ పేర్ని నాని సెటైర్లు | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే