ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలకు అభ్యంతరం లేదని రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు., రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విజయసాయిరెడ్డి ప్రసంగించారు.
న్యూఢిల్లీ: Andhra Pradesh రాష్ట్రానికి Special Status ఇస్తే మిగిలిన రాష్ట్రాలకు అభ్యంతరం లేదని Rajya Sabha లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు.రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని Vijaya Sai Reddy ప్రస్తావించారు. అంతకుముందు ఇదే విషయమై మాట్లాడిన TDP ఎంపీ Kanakamedala Ravindra Kumar ఏపీ సర్కార్ పై చేసిన విమర్శలను విజయసాయిరెడ్డి తన ప్రసంగంలో తిప్పికొట్టారు. అంతేకాదు ప్రత్యేక హోదా అవసరమని నొక్కి చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి BJP చెబుతున్న కారణాలు అర్ధం లేనివని చెప్పారురాస్ట్ర విభజనతో Capital City , Metro Rail సహా పలు కీలక రంగాలను Andhra Pradesh కోల్పోయిందని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని చాలాసార్లు అడిగామన్నారు. కానీ కేంద్రం నుండి స్పందన లేదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏపీపై సవతి తల్లి ప్రేమ చూపుతుందని ఆయన విమర్శించారు.
రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రి Manmohan Singh, రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా విషయమై రాజ్యసభలో బీజేపీ ఎంపీ Venkaiah Naidu అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాని కంటే ఎక్కువ ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హమీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కార్ తొలుత ప్రత్యేక హోదాకు సానుకూలంగానే ఉన్నట్టు కన్పించింది. అయితే ఆ తర్వాత ప్రత్యేక హోదాకు సరితూగే ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని మోడీ సర్కార్ ప్రకటించింది. ప్రత్యేక ప్యాకేజీకి అప్పటి Chandrababu సర్కార్ అంగీకరించింది. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రత్యేక హోదా అవసరం లేదని టీడీపీ వాదించింది.
ఈ విషయమై వైసీపీ,Jana Sena సహా పలు పార్టీలు ఆందోళనలు నిర్వహించాయి. ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ ప్రధానంగా ప్రస్తావించింది. 2019 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి వన్ సైడ్ మెజారిటీ దక్కింది. దీంతో ప్రత్యేక హోదా అంశం ఆటకెక్కింది. ఇతర పార్టీలపై ఆధారపడి కేంద్రం ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటే ప్రత్యేక హోదాపై కేంద్రం సానుకూలంగా స్పందించేదనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత వైఎస్ జగన్ ప్రత్యేక హోదా విషయమై వినతి పత్రం సమర్పించారు.
ఆ తర్వాత కూడా పలు దఫాలు ఈ విషయమై వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా విషయమై కేంద్రాన్ని అడిగారు. కానీ ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని ప్రకటించింది. ఏపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. ఇవాళ అవకాశం దొరకడంతో మరోసారి రాజ్యసభలో విజయసాయిరెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. విభజన సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.