
చిత్తూరు : kodi knife పొడుచుకుని ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన chittoorలో జరిగింది. ఈ విచిత్రమైన ఘటన చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం నిప్పువనంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కలిచెర్ల పోలేరమ్మ గుడి సమీపంలో kodi pandalu జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు దాడుల వెళ్లారు. పోలీసులను చూసి పందెంరాయుళ్లు పరారయ్యారు. వెళ్తూ వెళ్తూ కోళ్లను పట్టుకుని వెళ్లాలన్న హడావిడిలో ఓ వ్యక్తికి కోడి knife పొడుచుకుంది. ఇలా పొడుచుకుందో లేదో అలా రక్తం ధార కట్టింది. గాయపడిన వ్యక్తిని ముదివేడుకు చెందిన గంగులయ్యగా గుర్తించారు.
కాగా అతడిని వెంటనే లోకల్ పీహెచ్సీకి తరలించినా.. చికిత్స పొందుతూ కాసేపటికే అతను చనిపోయాడు. సాదాసీదా కేసు కింద ఈ కోడిపందాలకు సంబంధించి 12 మందిని అరెస్టు చేశారు. అయితే పోలీసుల భయంతోపరుగులు తీసి గంగులయ్య చనిపోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది.
సాధారణంగా కోడిపందాల్లో కోడిపుంజు కాలుకి కట్టే కత్తులు ఎంతో పదునుగా ఉంటాయి. వాటిని నిపుణులైన వ్యక్తులతో మాత్రమే కోడికాళ్లకు కట్టిస్తుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తీవ్ర గాయాలపాలు అవడం ఖాయం. కోడి కత్తి తగిలితే తీవ్ర రక్తస్రావం అవుతుంది. అందుకే కోడిపందాలు జరిగేటప్పుడు బరిలోకి ఎవర్ని రానివ్వరు.
మామూలుగా అయితే సంక్రాంతి సమయంలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే చిత్తూరు జిల్లాలో ఇప్పుడు కోడి పందాలు నిర్వహించడం.. దీంట్లో ఊహించని రీతిలో ఓ వ్యక్తి కోడి కత్తి తగిలి మరణించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిమీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, మరోవైపు ఇప్పటి వరకు prakasam districtలో జరిగిన పావురాళ్ల పందేలు ప్రస్తుతం పక్కనే ఉన్న nellore జిల్లాకు పాకాయి. నాయుడుపేటలో పిజియన్ ఫైట్ కు అంతా రెడీ అయ్యింది. వందలాది పావురాలను ఎగర వేసేందుకు రంగం సిద్ధమైంది. కానీ అంతలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. నాయుడుపేట నుంచి చెన్నైకి పావురాల పందాలు సిద్ధమవుతుండగా అడ్డుకున్నారు. చెన్నైకి చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల ఏపీలో వరుసగా ఈ పావురాళ్ల పందేలు నిర్వహిస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఆదివారం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామ శివార్లలో ఒక్కసారిగా వందలాది పావురాలు గాల్లోకి ఎగిరాయి. ప్రజలు ఏమైందోనని ఆందోళన చెందారు. చాలామంది హుటాహుటిన గ్రామ శివారుల్లోకి వచ్చి.. అక్కడ జరుగుతున్న దృశ్యాలను చూసి అవాక్కయ్యారు. అక్కడ చెన్నై నుంచి వచ్చి పావురాల పందాలు నిర్వహిస్తున్నారు పందెంరాయుళ్లు. పావురాల బెట్టింగ్ తో హల్ చల్ చేశారు.
ఈ పిజియన్ రేస్ కోసం చెన్నై నుంచి నాలుగు లారీలలో ప్రత్యేకంగా తయారు చేసిన బోనుల్లో పావురాలను తీసుకువచ్చారు నిర్వాహకులు. చిన్న కొత్తపల్లి వద్ద ఆ పావురాలని వదిలిపెట్టారు. ఏ పావురం ముందుగా చెన్నై చేరితే అదే విజేతగా నిలుస్తుందని అంటున్నారు. ఆ పావురం యజమానికి విండో పిజియన్ అనే సంస్థ బహుమతి ఇవ్వనుంది. ఈ విండో పిజియన్ సంస్థ ఆధ్వర్యంలోనే పిజియన్ రేసులు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే చెన్నై నుంచి ఈ ప్రాంతానికి తీసుకువచ్చి ఎందుకిలా వదిలేస్తున్నారని స్థానికులు వారిని ప్రశ్నించారు. దీంతో నిర్వాహకులు అక్కడి నుంచి పరారయ్యారు .
మరోవైపు ఈ పందాల్లో కోట్ల రూపాయల బెట్టింగ్ జరుపుతారని చర్చ కూడా జరుగుతోంది. అద్దంకి ప్రాంతం నుంచి చెన్నైకి ముందుగా ఏ నెంబర్ ట్యాగ్ ఉన్న పావురం చేరుకుంటే.. ఆ పావురం నెంబర్ ను ఎంచుకున్న వ్యక్తి బెట్టింగ్ లో గెలిచినట్లుగా ప్రకటిస్తారని తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న అద్దంకి పోలీసులు 4 లారీలను, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, సహాయకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వివిధ సంస్థలకు చెందిన పావురాలను ఈ పందెం కోసం తీసుకు వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.