బీజేపీ, జనసేన రెండూ రెండే... రఘురామకృష్ణం రాజు షాకింగ్ కామెంట్స్

Published : Jan 16, 2020, 10:44 AM IST
బీజేపీ, జనసేన రెండూ రెండే... రఘురామకృష్ణం రాజు షాకింగ్ కామెంట్స్

సారాంశం

బీజేపీ, జనసేన రెండు పార్టీలు బలహీనమైనవే అని...ఆ రెండు పార్టీలు కలవాలనుకోవడం సహజమని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ రెండు పార్టీల పొత్తు వలన వచ్చే ఫలితం చూడాలంటే నాలుగున్నరేళ్లు ఆగాలని వ్యాఖ్యానించారు.

ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆందోళనలు, ధర్నాలు సాగుతున్నాయి. రాజధాని ఏది అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు. ఈ సంగతి పక్కన పెడితే... జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో అందరి దృష్టిని ఆయన ఆకర్షించారు. ప్రస్తుం దీనిపై చర్చులు కూడా జోరందుకుంటున్నాయి.

Also Read నాలుగేళ్ల ప్లాన్: పవన్‌తో చర్చలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యల

కాగా... ఈ విషయంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు.బీజేపీ, జనసేన రెండు పార్టీలు బలహీనమైనవే అని...ఆ రెండు పార్టీలు కలవాలనుకోవడం సహజమని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ రెండు పార్టీల పొత్తు వలన వచ్చే ఫలితం చూడాలంటే నాలుగున్నరేళ్లు ఆగాలని వ్యాఖ్యానించారు.

 వైసీపీ చాలా బలంగా ఉందని, వారి పొత్తు వలన తమ పార్టీకి ఎటువంటి నష్టం ఉండదని తెలిపారు. రెండు పార్టీల విధివిధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈరోజు సాయంత్రంలోగా తేలుతుందని...అప్పటి వరకు వేచి చూద్దామని ఎంపీ రఘు రామకృష్ణంరాజు అన్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్