ప్రజల మాటలు వింటే సీఎం గుండె ఆగిపోతుంది... జగన్ వెంట్రుకలు కాదు.. మనల్ని పీకేస్తారు.. : రఘురామ కృష్ణరాజు

By SumaBala BukkaFirst Published Apr 9, 2022, 8:03 AM IST
Highlights

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద ఘాటుగా విమర్శలకు దిగారు. జగన్ వెంట్రుకలతో ఎవరికి ఏం పని అని ఎద్దేవా చేశారు. జనాలు వెంట్రుకల్ని కాదు మనల్ని పీకేస్తారంటూ విమర్శలు చేశారు. 

ఢిల్లీ : ముఖ్యమంత్రి తన ఇంట్లో కూర్చుని సొంత పత్రిక చదవడం మానేసి మారువేషంలో ప్రజల్లో తిరిగినా..  ఇంటిలిజెంట్ నుంచి వాస్తవాలు తెలుసుకున్నా..  social mediaల్లో  తిట్టే తిట్లు చూసుకున్నా..  ఆయన గుండె ఆగిపోతుందని వైసీపీ ఎంపీ raghurama krishnam raju అన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ కోతలు అంటే ఊరుకునేది లేదన్న అధికారి ఢిల్లీకి మారిపోయారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉందని..  రాష్ట్రంలో చేతకాని దద్దమ్మ, అసమర్థ ప్రభుత్వం ఉందని విమర్శించారు. తమను చూసి ప్రతిపక్షాలు, పత్రికలు ఏడుస్తున్నాయని ముఖ్యమంత్రి అంటున్నారని, పరిశ్రమలకు పవర్ హాలిడే ఇస్తున్నందుకా..  మరి ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారు.. అని ఆయన ప్రశ్నించారు. 

రాష్ట్రంలోవాలంటీర్ల వ్యవస్థే దరిద్రం అంటే వాళ్లకు సేవారత్న, సేవావజ్ర అంటూ కోట్లతో అవార్డులు, రివార్డులు ఇస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు పింఛన్ల డబ్బు తీసుకుని ప్రియురాలితో  వాలంటీర్ వెళ్ళిపోయాడు.. అనే వార్తలు వస్తున్నాయి అన్నారు. చిన్న పిల్లలు ఏడిస్తే  బలం అని నానుడి ఒకటి ఉందని..  దానికోసం జగన్మోహన్ రెడ్డి కరెంటు కోతలు పెట్టి పిల్లలను ఏడిపిస్తున్నారు అని.. సామాజిక మాధ్యమాల్లో చెప్పుకుంటున్నారని.. దానికి జగనన్న బాల దీవెన అని పేరు పెట్టాలని ఆయన సూచించారు.

సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే విద్యుత్ సమస్యలు వచ్చాయని… ఢిల్లీ వచ్చినప్పుడు బొగ్గు శాఖ మంత్రిని కలిసారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల తప్పులు,  కార్పొరేషన్ పేరుతో దొంగరుణాలు తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రికి,  కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖలు రాసి… కాగ్ నివేదికలు జతచేసి పంపడంతో ముఖ్యమంత్రిని.. ప్రధాని ఢిల్లీ పిలిపించారని ఆయన తెలిపారు. లేకుంటే అప్పుల కోసం, ముఖ్యమంత్రి చెప్పే సోది కోసం నెలరోజుల్లోనే ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వరన్నారు. ఢిల్లీకి పిలిచి ముఖ్యమంత్రికి చీవాట్లు పెట్టారు అన్నారు.

ముఖ్యమంత్రి పదేపదే ప్రతిపక్ష నేతలను తిట్టి వారిద్దరినీ దగ్గర చేస్తున్నారని తమ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ తో మనకు గొడవ ఎందుకని ఆయన ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు. ఏ కులం వారిని ఆ కులంవారితో తిట్టించాలని విచిత్రమైన భావన.. ముఖ్యమంత్రికి ఉందని అందులో భాగంగా పేర్ని నానితో పవన్ కళ్యాణ్ ని తిట్టిస్తారని తెలిపారు. త్రీ ఇడియట్ సినిమా లో  టార్చ్ లైట్ తో అమీర్ ఖాన్ ఆపరేషన్ చేశారని.. అలాగే మన దగ్గర ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరా లేక కొవ్వొత్తులు,  టార్చ్ లైట్ తో  ప్రసవాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కోతలతో ఆక్వా పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటుంది అన్నారు. వైద్యులు వేరే ఆస్పత్రిలో పని చేయకూడదు అనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ వ్యాపారాలు చేయకూడదని.. మారు పేర్లతో మీరు వ్యాపారం చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు.

వెంట్రుకలు కాదు..  మనల్ని పీకేస్తారు..
తన వెంట్రుక కూడా పీకలేరు అని ముఖ్యమంత్రి అంటున్నారని, ఆయన వెంట్రుకలతో ఎవరికి ఏం పని అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రజలు ఆగ్రహిస్తే మనల్ని పీకేస్తారని తెలిపారు. వెంట్రుకలు పరీక్షించుకోవాలంటే ముఖ్యమంత్రి తన బాధ్యతలను తాత్కాలికంగా పెద్దిరెడ్డికి అప్పగించాలని సూచించారు. మంత్రులుగా  పెద్దిరెడ్డి, కొడాలి, బొత్స లను  మంత్రివర్గం నుంచి తొలగించిన మళ్ళీ తీసుకుంటారని.. వారిని తొలగిస్తే పార్టీకి సమస్యలు ఎదురవుతాయని అన్నారు. సామాజిక న్యాయం ఎస్సి, బిసీలకు పదవులు అంటూనే ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన రవిచంద్రారెడ్డి ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారని ఆయన విమర్శించారు..తిరుపతి జిల్లాలో అన్ని పదవుల్లో ముఖ్యమంత్రి సామాజిక వర్గం వారే ఉన్నారంటూ వారి పేర్లు చదివి వినిపించారు. సామాజిక న్యాయం కోసం ముఖ్యమంత్రి పదవి ఎవరికైనా ఇవ్వాలని ఆయన జగన్మోహన్రెడ్డికి సూచించారు.

click me!