‘సంతకం పెట్టకపోతే ఇక్కడే చంపేస్తాం’.. వీఆర్వోకు వైసీపీ నేతల బెదిరింపులు..

Published : Apr 09, 2022, 07:33 AM IST
‘సంతకం పెట్టకపోతే ఇక్కడే చంపేస్తాం’.. వీఆర్వోకు వైసీపీ  నేతల బెదిరింపులు..

సారాంశం

వైఎస్సార్ పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.. ప్రభుత్వఉద్యోగులు కత్తిమీద సాములా రోజూ ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. తాజాగా కడప జిల్లాలో ఓ వీఆర్వోను చంపుతామంటూ బెదిరించారు నేతలు.. 

కడప : Kadapa YSR Districtలో నేతల బెదిరింపులు శృతిమించిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగులు భయం నీడన విధులు నిర్వహించాల్సి వస్తుంది. పోలీసులను ఆశ్రయించిన ప్రయోజనం ఉండటం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ సీకే దీన్నె మండలం పాపాసాహెబ్ పేట VRO ఉదంతం. గత నెల 30న ఉదయం పదిన్నర గంటలకు గ్రామ సచివాలయంలో విధుల్లో ఉన్న వీఆర్వో సాదిక్ భాషా వద్దకు ఇదే మండలం చెర్లోపల్లికి చెందిన కొందరు నేతలు వచ్చి వందలాదిగా ఫోర్జరీ ఇళ్ల పట్టాలు పొందిన భూములపై రుణం పొందడానికి పత్రాలపై సంతకాలు చేయాలని కోరారు. తద్వారా భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ఎత్తుగడలో భాగంగా నేతలు ప్రయత్నాలు చేశారు.

అయితే, ఈ వ్యవహారం రెవెన్యూ పరిధిలో లేదని గృహనిర్మాణశాఖ అధికారులు ఆశ్రయించాలని వీఆర్వో సూచించారు. దీంతో నేతలు చెప్పినట్టు సంతకాలు పెట్టలేదు అని ఆగ్రహంతో ఊగిపోతూ.. సంతకాలు పెట్టకపోతే చంపేస్తామని బెదిరించినట్టు వీఆర్వో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురు నేతలు ఇదే సమయంలో దాడికి ప్రయత్నించడంతో పాటు తీవ్ర పదజాలంతో హెచ్చరించినట్లు వివరించారు. ఘటన జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ చేరుకుని ఈ సమస్యను వివరించడంతో పాటు ఫిర్యాదు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారని,  ‘నువ్వు చెర్లోపల్లె ఎలా వస్తావో చూస్తామంటూ..’ హెచ్చరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

నాపై ఎస్సీ, ఎస్టీ వారితోపాటు ఆడవారితో కేసులు పెట్టిస్తామని భయపెడుతున్నట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసి వారం రోజులు కావస్తున్నా కేసు నమోదు చేయలేదు.. అంటూ తమ గోడును తహసిల్దార్ విజయ్ కుమార్ కు వివరించారు. సదరు అధికారి కూడా సీఐకి మరో లేఖతో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రతులను ఉన్నతాధికారులకు నివేదించారు. దాడికి ప్రయత్నించిన సురేంద్ర రెడ్డి, ఇ గురుమూర్తి, ప్రసాద్, రామకృష్ణరెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు ప్రాణభయం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా,Tirupati to Secunderabad కి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు లో శుక్రవారం అర్ధరాత్రి robbery జరిగింది. గుర్తుతెలియని దుండగులు పథకం ప్రకారం రైలును ఆపి దోపిడీకి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా గుత్తి మండల  పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు సిగ్నల్ తీగలను కత్తిరించారు. దీంతో సిగ్నల్ లేకపోవడంతో  స్టేషన్ ఔటర్ లో ఆగిపోయింది. వెంటనే దుండగులు బోగి లోకి చొరబడి మారణాయుధాలను చూపించి ప్రయాణికులను దోచుకున్నారు.

వారి నుంచి నగదు, బంగారు నగలు లాక్కున్నారు. ఎంత మొత్తం దోపిడీ జరిగిందో వివరాలు తెలియరాలేదు. ఆరు తులాల బంగారం, నగలు దుండగులు దోచుకున్నట్టు ప్రాథమిక సమాచారం. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులతోపాటు సివిల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగుల కోసం గాలించారు. అనంతరం తురకపల్లి స్టేషన్ మాస్టర్ రైలుకు సిగ్నల్ ఇచ్చి పంపారు.

PREV
click me!

Recommended Stories

Wine Shop: మందు బాబుల‌కు కిక్కిచ్చే న్యూస్‌.. రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు వైన్స్ ఓపెన్
Tirumala Temple Decoration: ఇల వైకుంఠాన్ని తలపించేలా తిరుమల ఆలయం| Asianet News Telugu