సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ లో అర్ధరాత్రి దోపిడీ... సిగ్నల్ తీగలు కత్తిరించి మరీ...

Published : Apr 09, 2022, 07:12 AM IST
సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ లో అర్ధరాత్రి దోపిడీ... సిగ్నల్ తీగలు కత్తిరించి మరీ...

సారాంశం

సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ రైల్లో అర్ధరాత్రి దోపిడీ జరిగింది. స్టేషన్ కు ఔటర్ లో సిగ్నల్ తీగలు కత్తిరించిన దుండగులు రైలు ఆగగానే.. ఘాతుకానికి తెగబడ్డారు. నగదు, నగలు దోచుకున్నారు.   

అనంతపురం : Tirupati to Secunderabad కి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు లో శుక్రవారం అర్ధరాత్రి robbery జరిగింది. గుర్తుతెలియని దుండగులు పథకం ప్రకారం రైలును ఆపి దోపిడీకి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా గుత్తి మండల  పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు సిగ్నల్ తీగలను కత్తిరించారు. దీంతో సిగ్నల్ లేకపోవడంతో  స్టేషన్ ఔటర్ లో ఆగిపోయింది. వెంటనే దుండగులు బోగి లోకి చొరబడి మారణాయుధాలను చూపించి ప్రయాణికులను దోచుకున్నారు.

వారి నుంచి నగదు, బంగారు నగలు లాక్కున్నారు. ఎంత మొత్తం దోపిడీ జరిగిందో వివరాలు తెలియరాలేదు. ఆరు తులాల బంగారం, నగలు దుండగులు దోచుకున్నట్టు ప్రాథమిక సమాచారం. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులతోపాటు సివిల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగుల కోసం గాలించారు. అనంతరం తురకపల్లి స్టేషన్ మాస్టర్ రైలుకు సిగ్నల్ ఇచ్చి పంపారు.

ఇదిలా ఉండగా, ఈ ఫిబ్రవరి 14 న Sampark Kranti Express train యశ్వంతపూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్తుండగా Madhya Pradesh రాష్ట్రంలోని భోపాల్ లో దారుణం జరిగింది. ఓ యువతిని సాయం పేరిట మభ్యపెట్టిన కిరాతకుడు రైలులోనే molestationకి పాల్పడ్డాడు యువతి రైలు ఎక్కిన తర్వాత ఆమెకు కూర్చునేందుకు చోటు దొరకలేదు. దీంతో వంట చేసే Bogieలో ఖాళీ ఉందని అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అంటూ ఓ వ్యక్తి ఆమెను నమ్మించి అక్కడికి తీసుకెళ్లాడు.  

అక్కడ ఆమె నిద్రించే సమయంలో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. వంట చేసే భోగి వద్దకు వెళ్లగా అందులో ఉన్న వారు వెంటనే తలుపు తెరవలేదు. పోలీసుల ఒత్తిడితో అరగంట తర్వాత తెరిచారు. అక్కడ అపస్మారకస్థితిలో పడివున్న బాధితురాలిని పోలీసులు రక్షించి.. ఆస్పత్రికి తరలించారు.  ఆస్పత్రిలో చికిత్స అనంతరం జరిగిన విషయాన్ని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 15 మంది అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు నిందితుడిని గుర్తించేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా, నిరుడు జూన్ లోనూ మధ్యప్రదేశ్ లో దారుణ ఘటనే  చోటు చేసుకుంది. నడుస్తున్న రైలులో 21 యేళ్ల యువతి మీద అత్యాచారయత్నం చేసి, గొంతుకోసి చంపి పడేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెహోర్ లో జరిగింది. ఇండోర్-బిలాస్ పూర్ రైలులో నుంచి సెహోర్ రైల్వే స్టేషన్ సమీపంలో యువతి మృతదేహాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని జిల్లా సీనియర్ పోలీసు అధికారి ఎస్ఎస్ చౌహాన్ చెప్పారు. 

రైలులో ఒక మహిళ తమ వైపు పరుగెత్తుకు రావడం చూశామని ప్రయాణికులు చెప్పారు. ఇండోర్-బిలాస్ పూర్ రైలు స్లీపర్ కోచ్ లో ప్రయాణిస్తున్న తన సోదరిని కొంతమంది లైంగికంగా వేధించారని, దీంతో డయల్ 100కు ఫోన్ చేసి చెప్పానని మృతురాలి సోదరుడు చెప్పారు. బాధిత యువతి గొంతుకోసి నిందితులు పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించి కేసును దర్యాప్తు చేశారు.

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu