
విజయవాడ : స్థానిక సంస్థల కోటాలో గెలిచిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ మోషన్ రాజు వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. కుడిపూడి సూర్యనారాయణ, నర్తు రామారావు, కవురు శ్రీనివాస్, అలంపూర్ మధుసూదన్, వంకా రవీంద్రనాథ్, సిపాయి సుబ్రహ్మణ్యం, మెరుగు మురళీధర్, రామసుబ్బారెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు బుడి ముత్యాల నాయుడు, మెరుగు నాగార్జున, ధర్మాన ప్రసాదరావు, మెరుగు నాగార్జున, చెల్లబోయిన వేణు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి ప్రసాద్ రాజు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
100వ రోజుకు చేరిన నారా లోకేష్ యువగళం.. పాదయాత్రలో పాల్గొన్న నారా, నందమూరి కుటుంబ సభ్యులు..
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వైసిపి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ శాసనమండలికి పోటీ చేసే వైసిపి అభ్యర్థులను సామాజిక వర్గాల వారీగా అవకాశం ఇచ్చారు. శాసనమండలి అభ్యర్థులలో ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు ముఖ్య మంత్రి పెద్దపీట వేశారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో కూడా సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం కల్పించారు.
ఈ లిస్టు ప్రకారం..
- తూర్పుగోదావరి జిల్లా నుంచి కుడిపూడి సూర్యనారాయణ (అమలాపురం)
- నెల్లూరు నుంచి మేరుగ మురళీధర్ ( గూడూరు)
- శ్రీకాకుళంలో నర్తు రామారావు
- శ్రీకాకుళం నుంచి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం
- కడప నుంచి మాజీ మంత్రి పి రామసుబ్బారెడ్డి (జమ్మలమడుగు)
- పశ్చిమగోదావరి జిల్లాలో వంకా రవీంద్రనాథ్ లు గెలిచారు.