కరోనాకు భయపడకుండా... మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Aug 06, 2020, 09:48 PM IST
కరోనాకు భయపడకుండా... మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి (వీడియో)

సారాంశం

 ఓ మనిషి కళ్లముందే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా ఎవ్వరూ పట్టించుకోకపోయినా స్వయంగా మహిళా ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. 

అమరావతి: కరోనా భయం మనుషుల్లోని మానవత్వాన్ని చంపేసింది. ఓ మనిషి కళ్లముందే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా ఎవ్వరూ పట్టించుకోకపోయినా స్వయంగా మహిళా ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. కొందరిలో అయినా ఇంకా మానవత్వం దాగివుందని నిరూపిస్తూ క్షతగాత్రుడికి రోడ్డుపైనే స్వయంగా ఎమ్మెల్యేనే ప్రథమచికిత్స అందించి హాస్పిటల్ కు తరలించారు. ఇలా తన మంచి మనస్సుతో ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు వైసిపి ఎమ్ముల్యే ఉండవల్లి శ్రీదేవి. 

వీడియో

"

ఇవాళ పిడుగురాళ్ల హైవేలో లారీ- బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలై రోడ్డుపై పడిపోయాడు. అయితే కరోనా భయంతో స్థానికులు అతడు ప్రాణాపాయ స్థితిలో వున్నా కాపాడేప్రయత్నం చేయలేదు. అయితే అదే సమయంలో  అటువైపుగా వెళుతున్న ఎమ్మెల్యే శ్రీదేవి అతన్ని గమనించారు. వెంటనే కారులోంచి హుటాహుటిన దిగి గాయపడిన వ్యక్తి వద్దకు వెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అతన్ని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించే ఏర్పాటు చేశారు. ఇలా కరోనాకు జంకకుండా ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఎమ్మెల్యే  ప్రశంసలు అందుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu