ఆ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారు.. పార్టీ మారడంపై దృష్టి: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

Published : Feb 02, 2023, 04:50 PM IST
ఆ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారు.. పార్టీ మారడంపై దృష్టి: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

సారాంశం

టీడీపీ లీడర్, మాజీ మినిస్టర్ భూమా అఖిల ప్రియా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఎమ్మెల్యే  శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి టీడీపీలోకి మారడంపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్‌లోకి వచ్చినట్టు తనకు తెలిసిందని అన్నారు.  

అమరావతి: టీడీపీ నేత భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని తనకు తెలిసిందని వివరించారు. అంతేకాదు, ఆమె పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఆమె చూపు టీడీపీ వైపు ఉన్నదని తెలిపారు. టీడీపీలో చేరడానికి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి వేదిక సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. 

విలేకరులతో భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు. ఈ నెల 4వ తేదీన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని అన్నారు. అదే విధంగా తనపై వారు ఆరోపణలు చేసినట్టుగా తన అక్రమాలేమిటో శిల్పా రవి కూడా బయటపెట్టాలని చాలెంజ్ చేశారు. 4వ తేదీన నంద్యాలలోని గాంధీ చౌక్ వద్దకు ఎమ్మెల్యే శిల్పా రవి అక్రమాల చిట్టాను తాను తీసుకు వస్తానని అన్నారు. తాను అక్రమాలకు పాల్పడినట్టు శిల్పా రవి చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలని లేదంటే.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: శిల్పా రవికి అఖిలప్రియ సవాల్.. వారం గడువు, నువ్వు ఫెయిలైతే

నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే శిల్పా రవి భార్య నాగినిరెడ్డి దురుసు గా వ్యవహరించారని భూమా అఖిల ప్రియా ఆరోపించారు. టీడీపీ కౌన్సిలర్లను గొర్రెలు అని దురుసుగా మాట్లాడారని పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే