టీడీపీలో చేరేందుకు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి యత్నం: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

By narsimha lodeFirst Published Feb 2, 2023, 4:10 PM IST
Highlights

నంద్యాల ఎమ్మెల్యే  శిల్పా రవి  అక్రమాలను  ఆధారాలతో బయటపెడతానని  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు.  
 

కర్నూల్: ఈ నెల  4వ తేదీన  నంద్యాల  ఎమ్మెల్యే  శిల్పా రవి  అక్రమాలను  ఆధారాలతో బయటపెడతానని మాజీ మంత్రి  భూమా అఖిలప్రియ చెప్పారు.గురువారం నాడు  నంద్యాలలో  భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు.  తనపై  ఎమ్మెల్యే  శిల్పా రవి  చేసిన ఆరోపణలను రుజువు చేయాలని భూమా అఖిలప్రియ  సవాల్ విసిరారు.  నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి  చూపు టీడీపీ వైపు ఉందని ఆమె  చెప్పారు.  టీడీపీ నాయకులతో  శిల్పా రవి టచ్ లో  ఉన్నారని  తనకు  సమాచారం ఉందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ  చెప్పారు. వైసీపీలో  శిల్పా రవికి పొసగడం లేదని ఆమె  చెప్పారు.దీంతో  టీడీపీలో  చేరేందుకు  శిల్పా రవి  ప్రయత్నాలు  చేస్తున్నారన్నారు.

నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేసేందుకు  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ  ప్రయత్నాలు  చేస్తున్నారని  గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. ఈ మేరకు  నంద్యాల నియోజకవర్గంలో   మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల  ఎమ్మెల్యే  శిల్పా రవి మధ్య  విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి.. తాజాగా   ఎమ్మెల్యేలను లక్ష్యంగా  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ  చేసిన  విమర్శలపై  ఎమ్మెల్యే  రవి  ఏ రకంగా  స్పందిస్తారో చూడాలి.

2014 ఎన్నికల్లో  నంద్యాల  నుండి భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి కూతురు  భూమా అఖిలప్రియ  గెలుపొందారు.  ఆ తర్వాత చోటు  చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  భూమా నాగిరెడ్డి , ఆయన కూతురు అఖిలప్రియలు  వైసీపీని వీడి టీడీపీలో  చేరారు.    గుండెపోటు కారణంగా భూమా నాగిరెడ్డి  మరణించడంతో  నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన  ఉప ఎన్నికల్లో  భూమా బ్రహ్మనందరెడ్డి  విజయం సాధించారు. గత ఎన్నికల్లో  ఆళ్లగడ్డ నుండి అఖిలప్రియ, నంద్యాల నుండి భూమా బ్రహ్మనందరెడ్డిలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 
 

click me!