విజయనగరం వైసిపి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం... రాజీనామా చేస్తానని ప్రకటన

By Arun Kumar PFirst Published Aug 31, 2018, 1:40 PM IST
Highlights

విజయనగరం జిల్లాలో ప్రతిపక్ష వైసిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యే  ఒకరు సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ఇపుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని కరాసువలస మండలంలో ఇటీవల విషజ్వరాల కారణంగా 9 మంది చనిపోయారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే రాజన్న దొర పీడిక ఘాటుగా స్పందించారు. ఈ మరణాలపై అటు ప్రతిపక్ష వైసిపి గానీ ఇటు అధికార టిడిపి పార్టీలు స్పందించకపోవడంపై ఆయన మనస్థాపానికి గురయ్యారు. ఈ మరణాల గురించి పట్టించుకోకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. దీంతో ఈ విషయం విజయనగర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇలా అనారోగ్యంతో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం తమకు పట్టనట్లు వ్యవమరించడం పై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇవి అనారోగ్యం కారణంగా సంభవించిన మరణాలు కావని ప్రభుత్వం చేసిన హత్యలేనని రాజన్న దొర పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించకుంటే తాను ప్రకటించినట్లు రాజీనామా చేయడం ఖాయమని రాజన్న దొర స్పష్టం చేశారు.  
 
click me!