దివిసీమను వదలని పాములు.. ఒక్క రోజులో 10 మందికి పాము కాటు

By sivanagaprasad KodatiFirst Published Aug 31, 2018, 11:31 AM IST
Highlights

కృష్ణాజిల్లా దివిసీమను పాముల భయం వెంటాడుతోంది. వర్షాకాలానికి తోడు.. కృష్ణానదిలో వరద ప్రవాహం పెరగడంతో ఎక్కడెక్కడి నుంచో పాముటు కొట్టుకొస్తున్నాయి.

కృష్ణాజిల్లా దివిసీమను పాముల భయం వెంటాడుతోంది. వర్షాకాలానికి తోడు.. కృష్ణానదిలో వరద ప్రవాహం పెరగడంతో ఎక్కడెక్కడి నుంచో పాముటు కొట్టుకొస్తున్నాయి. పొలానికి వెళ్లే రైతులు, మత్య్సకారులు పాము కాటుకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క ఆగస్టు నెలలోనే 208 పాము కాటు కేసులు నమోదయ్యాయి.

మరోవైపు పాముకాటు బాధితులతో అవనిగడ్డ ఏరియా ఆస్పత్రి కిటకిటలాడుతోంది. నిన్న ఒక్క రోజే 10 మంది పాముకాటుకు గురయ్యారు. అయితే వీరిలో ఒకరిని మాత్రమే విషపూరిత సర్పం కాటు వేసిందని.. మిగిలిన తొమ్మిది మందికి ప్రథమ చికిత్స చేసి పంపించినట్లు వైద్యులు తెలిపారు.

అవనిగడ్డ ఆస్పత్రిలో  పాముకాటు బాధితులను డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, జెడ్పీ ఛైర్‌పర్సన్ అనురాథ పరామర్శించారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ... పాముకాటు నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. అవసరమైన ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచినట్లు ఆమె తెలిపారు.

సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి:

పాము కాట్లకు విరుగుడు: 29న బాబు ప్రభుత్వం సర్పయాగం

దివిసీమను వణికిస్తున్న పాములు.. మోపిదేవి ఆలయంలో జనాల పూజలు

ఎర్ర చందనం స్మగ్లర్ చిట్కా: పాములు దగ్గరికి రావద్దంటే...

పాముకాటుకు మరో ఇద్దరు రైతుల బలి....22 రోజుల్లో 85 మందికి పాముకాట్లు

click me!