ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రంరెడ్డి సోమవారం నాడు ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విక్రంరెడ్డి విజయం సాధించారు. మేకపాటి గౌతం రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి YS Jagan ను ఆత్మకూరు ఎమ్మెల్యే Mekapati Vikram Reddyని సోమవారం నాడు కలిశారు. Atmakur Bypoll ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విక్రంరెడ్డి విజయం సాధించారు. ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం నాడు వెల్లడైన విషయం తెలిసిందే.ఈ ఎన్నికల్లో మేకపాటి విక్రంరెడ్డి తన సమీప BJP అభ్యర్ధి భBharath Kumar పై 82,888 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.
undefined
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి ఇవాళ కలిశారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచిన విక్రమ్‌రెడ్డిని సీఎం జగన్ అభినందించారు. ఎమ్మెల్యే వెంట మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు.
సీఎంను కలిసిన తర్వాత ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతి ఇంటికి జగనన్న అండగా నిలిచారన్నారు. ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్లాయనేందుకు ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా గడప గడపకి వెళ్లినపుడు స్పష్టంగా కనిపించిందన్నారు. అందుకే ఇంత పెద్ద మెజార్టీతో ప్రజలు ఆదరించారని ఆయన చెప్పారు. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చేయాల్సిన పనుల గురించి సీఎం చర్చించారన్నారు. పారిశ్రామిక ప్రగతి పై దృష్టి పెడుతున్నట్టుగా విక్రం రెడ్డి చెప్పారు.నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జులైలో తన సోదరుడు గౌతమ్ రెడ్డి పేరుపై ఉన్న సంగం బ్యారేజినీ సీఎం ప్రారంభిస్తారని ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి తెలిపారు.
వైసీపీ అభ్యర్ధి విక్రమ్ రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి Bharath kumar కు 19,352 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తొలి రౌండ్ నుండి వైసీపీ అభ్యర్ధి విక్రం రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగారు. తన సమీప ప్రత్యర్థి భరత్ కుమార్ పై 82, 888 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు.
ఈ ఏడాది జూన్ 23 ఆత్మకూర్ లో ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరిగింది. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఉపఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. గత 2019 ఎన్నికల్లో ఆత్మకూర్‌లో 83.32శాతం ఓట్లు పోలయ్యాయి. ఈసారి 64.14శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ఈ ఉపఎన్నికలో టీడీపీ పోటీ చేయలేదు. బీజేపీ,, బీఎస్పీ లను బరిలోకి దింపాయి. ఈ రెండు పార్టీలతో పాటు మరో పది మందికిపైగా ఇండిపెండెంట్లు కూడా బరిలో నిలిచారు.
మరణించిన ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులను ఎన్నికల బరిలో నిలిపిన సమయంలో పోటీకి నిలపకూడదని గతం నుండి వస్తున్న సంప్రదాయం మేరకు ఆత్మకూరు ఉప ఎన్నికకు దూరంగా ఉన్నామని టీడీపీ నేతలు ప్రకటించారు. గతంలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీకి దూరంగా నిలిచిన విషయం తెలిసిందే.
also read:ఆత్మకూరు ఉప ఎన్నికలు: ఓట్లు పెంచుకున్న బీజేపీ
ఈ ఏడాది ఫిబ్రవరి 21న గుండెపోటుతో మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణించాడు. హైద్రాబాద్ లోని తన నివాసంలో మేకపాటి గౌతం రెడ్డి గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. దీంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ ఆరోపణలు చేసింది. ఎన్నికల్లో అన్ని రకాలుగా అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసిందని బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ ఆరోపించారు. వలంటీర్లు వైసీపీ కూడా ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు.ఈ విషయమై ఏం చేయాలనే దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.