నన్ను టచ్ చేయడం నీ అయ్యవల్లే కాలేదు... నువ్వయితే వెధవ్వి..: లోకేష్ కు పిన్నెల్లి మాస్ వార్నింగ్ (వీడియో)

Published : Aug 08, 2023, 04:54 PM ISTUpdated : Aug 08, 2023, 05:03 PM IST
నన్ను టచ్ చేయడం నీ అయ్యవల్లే కాలేదు... నువ్వయితే వెధవ్వి..: లోకేష్ కు పిన్నెల్లి మాస్ వార్నింగ్ (వీడియో)

సారాంశం

మాచర్ల నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై స్పందించారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. 

మాచర్ల : యువగళం పాదయాత్రలో భాగంగా టిడిపి నేత నారా లోకేష్ తనపై చేసిన ఆరోపణలపై వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో జరిగిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యేపై లోకేష్ అవినీతి ఆరోపణలు చేసారు. దీంతో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసి లోకేష్ వ్యాఖ్యలను ఖండించారు ఎమ్మెల్యే పిన్నెల్లి. 

ఈ సందర్భంగా లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచకుపడ్డారు ఎమ్మెల్యే పిన్నెల్లి. సొంత నియోజకవర్గం మంగళగిరి పేరు కూడా సరిగ్గా పలకలేని వెదవ తన గురించి ఏదేదో మాట్లాడాడన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇదే లోకేష్ ను ఉచ్చ పోయించాడని...  ప్యాంటు తడుపుకుని మరీ హైదరాబాద్ కు పారిపోయాడని అన్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ కూడా తనను ఓడిస్తానని అనడం విడ్డూరంగా వుందన్నారు ఎమ్మెల్యే. 

వీడియో

తాను ఎమ్మెల్యేగా గెలవడమే కాదు కౌన్సిలర్లను ఏకగ్రీవంగా గెలిపించుకున్నానని... అడిగితే లోకేష్ ను కూడా వార్డ్ కౌన్సిలర్ ను చేసేవాన్ని అంటూ పిన్నెల్లి ఎద్దేవా చేసారు. 2024 తర్వాత టిడిపి పార్టీ వుంటదో లేదో చూసుకో లోకేష్... మళ్లీ నువ్వు ఆ అమ్మాయిలతో డ్యాన్స్ చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. నీ అయ్యే చంద్రబాబే మమ్మల్ని ఏం చేయలేకపోయాడు... నువ్వు కూడా మమ్మల్ని ఏం పీకలేవని అన్నారు. మమ్మల్ని టచ్ చేయడం మీ అయ్యవల్లే కాదు... నీ జీవితకాలం ప్రయత్నించినా టచ్ చేయలేవని అన్నారు. దమ్ముంటే టచ్ చేసి చూడు అంటూ పిన్నెల్లి సవాల్ విసిరారు. 

Read More  కొట్టండ్రా, తరమండ్రా అంటూ చంద్రబాబు రెచ్చొగొట్టాడు.. ఆ కేసులతో వైసీపీకి సంబంధం లేదు : పెద్దిరెడ్డి
 
ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని... నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బావుండేదని అన్నారు. స్థానిక టిడిపి నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు సొంతంగా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అన్నారు. ఆనాడు కాంగ్రెస్,టిడిపి కలిసి అన్యాయంగా జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపినా 2019 ఎన్నికలలో 151 సీట్లు గెలిచి ప్రజల మన్ననలు పొందామని అన్నారు. 2014 ఎన్నికల హామీలను నెరవేర్చలేని వారు మాపై ఆరోపణలు చేయడం సిగ్గుపడాలి అని పిన్నెల్లి అన్నారు. 

దొడ్డిదారిన మంత్రి అయిన నారా లోకేష్ 2018 ఆగస్టు ఏడో తేదీన మాచర్లను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చాడని... ఇచ్చిన మాట తప్పాడని అన్నారు. ఇప్పుడు మళ్లీ పల్నాటి రైతులను మోసం చేసేందుకు వచ్చాడు... ఇలాంటి లోకేష్ ఎన్ని పాదయాత్రలు చేసినా పల్నాటి ప్రజలు నమ్మరని అన్నారు. 

మాచర్ల నియోజకవర్గ టిడిపి అభ్యర్థికి బ్రహ్మ రెడ్డి నేరచరిత్ర కలిగినవాడని పిన్నెల్లి ఆరోపించారు. చివరకు కన్న తండ్రికి అన్నం పెట్టలేని నీచుడు, తల్లి ఎమ్మెల్యేగా వుండగా హైదరాబాద్ లో అమ్మాయిలతో డ్యాన్స్ బార్లు నిర్వహించివాడు మీ అభ్యర్థి అంటూ బ్రహ్మారెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇలాంటివాడు చెప్పడం... ఇది విని నువ్వు మాట్లాడటం దారుణమన్నారు. 30 ఏళ్లుగా మాచర్ల నియోజకవర్గంలో నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాం... నిన్నటి సభలో లోకేష్ ఆరోపించినట్లు భూదందా చేసి ఉంటే జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. బహిరంగ సభలో చేసిన ఆరోపణలకు లోకేష్ నిరూపించాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. 


  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!