
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 5,963 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 68వేలకి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 27 మంది మరణించారు. కరోనాతో కృష్ణా జిల్లాలో ఆరుగురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున చనిపోయారు. గుంటూరు, కడప, కర్నూల్, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. అనంతపురంలో ఒక్కరు చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,437 కి చేరుకొంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,57,15,757 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 37,765 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో5,963 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 2,569 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 9 లక్షల 12 వేల 510 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 49,053 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
గత 24 గంటల్లో అనంతపురంలో 156, చిత్తూరులో 1182,తూర్పుగోదావరిలో 626,గుంటూరులో 938, కడపలో 189,కృష్ణాలో 171, కర్నూల్ లో 434, నెల్లూరులో 491,ప్రకాశంలో 280, శ్రీకాకుళంలో 893, విశాఖపట్టణంలో 565, విజయనగరంలో 019,పశ్చిమగోదావరిలో019కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం -71,609 మరణాలు 618
చిత్తూరు -1,01436,మరణాలు 922
తూర్పుగోదావరి -1,29,938 మరణాలు 638
గుంటూరు -87,508, మరణాలు 694
కడప -58,502, మరణాలు 471
కృష్ణా -55,302,మరణాలు 710
కర్నూల్ -66,559, మరణాలు 514
నెల్లూరు -68,091మరణాలు 542
ప్రకాశం -66,265,మరణాలు 590
శ్రీకాకుళం -52,681,మరణాలు 353
విశాఖపట్టణం -68,500,మరణాలు 599
విజయనగరం -43,556 మరణాలు 240
పశ్చిమగోదావరి -95,158, మరణాలు 542