అప్పట్లో బన్నీ, నాగబాబే చెప్పారు.. జనసేన కార్యకర్తలకు తాలిబన్లకు తేడా లేదు: వైసీపీ ఎమ్మెల్యే

Siva Kodati |  
Published : Sep 03, 2021, 04:19 PM IST
అప్పట్లో బన్నీ, నాగబాబే చెప్పారు.. జనసేన కార్యకర్తలకు తాలిబన్లకు తేడా లేదు: వైసీపీ ఎమ్మెల్యే

సారాంశం

జనసేన కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మండిపడ్డారు.పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే చాలు... జనసేన కార్యకర్తలు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన కార్యకర్తల తీరు గురించి గతంలో అల్లు అర్జున్, నాగబాబు స్వయంగా చెప్పారని గ్రంథి శ్రీనివాస్ గుర్తుచేశారు  


వైసీపీ నేత, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జనసేన కార్యకర్తలు, నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎవరైనా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే చాలు... జనసేన కార్యకర్తలు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. భీమవరంలోనే కాదు, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉందన్నారు. జనసేన కార్యకర్తలకు, తాలిబన్లకు తేడా ఏమీలేదంటూ శ్రీనివాస్ సంచనల వ్యాఖ్యలు చేశారు.

నేను కొత్తగా చెప్పడం కాదు... జనసేన కార్యకర్తల తీరు గురించి గతంలో అల్లు అర్జున్, నాగబాబు స్వయంగా చెప్పారని గ్రంథి శ్రీనివాస్ గుర్తుచేశారు. జనసేన నేతలు పిల్లచేష్టలకు పాల్పడుతున్నారంటూ గ్రంథి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ భీమవరం ప్రజలకు కనిపించలేదని, ఆయన ఎందుకు కనిపించలేదన్న విషయాన్ని జనసేన కార్యకర్తలు ఓ బ్యానర్ వేసి ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందని హితవు పలికారు. భీమవరంలో అభివృద్ధి కుంటుపడింది అంటూ జనసేన పార్టీ నేతలు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తాజా వ్యాఖ్యలు చేశారు

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్