నకిలీ చలాన్ల కుంభకోణం ఎపెక్ట్: పలు శాఖల్లో ఏపీ సర్కార్ తనిఖీలు

By narsimha lode  |  First Published Sep 3, 2021, 2:40 PM IST

స్టాంపులు, రిజిస్ట్రేసన్ల శాఖలో నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగు చూడడంతో  ఇతర శాఖలపై  కూడ  అంతర్గత విచారణను ఏపీ సర్కార్ చేపట్టింది. కార్మిక, రవాణాశాఖ, ఎక్సైజ్, మైనింగ్ శాఖల్లో ఏపీ ప్రభుత్వం తనిఖీలు చేస్తోంది.



అమరావతి:  స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగు చూడడంతో ఇతర శాఖలపై కూడ ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పలు శాఖలకు చలాన్ల ద్వారా జమ చేస్తున్న నగదు చేరుతోందా లేదా అనే విషయమై ప్రభుత్వం పలు శాఖల్లో తనిఖీలు నిర్వహిస్తోంది.

చలాన్ల ద్వారా చెల్లిస్తున్న సీఎఫ్‌ఎంఎస్‌కి జమ అవుతోందా లేదా అనే అంశంపై అధికారులు కూపీ లాగుతున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సుమారు రూ. 8 కోట్ల మేరకు అక్రమాలు జరిగినట్టుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలకు పాల్పడిన సబ్ రిజిష్ట్రార్లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటేసింది. నకిలీ చలాన్ల కుంభకోణంలో సొమ్మును రికవరీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Latest Videos

ప్రభుత్వానికి  నిధులు వచ్చే శాఖల్లో  ఈ తరహా మోసాలు జరుగుతున్నాయా అనే కోణంలో  కూడ అధికారులు విచారణ చేస్తున్నారు. ఎక్సైజ్ , మైనింగ్ , రవాణా, కార్మిక శాఖల్లో  ప్రభుత్వం అంతర్గతంగా  విచారణను చేపట్టింది.ఆయా శాఖల్లో అవకతవకలను గుర్తిస్తే అందుకు బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

click me!