ఓ కానిస్టేబుల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పాల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన ఓ వివాహిత ఆరోపించింది. అతడి వల్ల తన మూడు నెలల గర్భం కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. దాచేపల్లిలో ఓ కీచక పోలీస్ గర్భిణీపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని, మీడియానే తనకు న్యాయం చేయాలని బాధితురాలు గోడు వెల్లబోసుకుంది. సోమవారం సాయంత్రం ఆమె మీడియాతో తన ఆవేదనను వ్యక్తం చేసింది.
హర్యానా-పంజాబ్ సరిహద్దులో ఉద్రిక్తత.. రైతులపై బాష్పవాయువు ప్రయోగం.. ఎందుకంటే ?
దాచేపల్లి పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న వెంకట్ నాయక్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని అదే పట్టణానికి చెందిన ఓ యువతి ఆరోపించింది. తన భర్తను పోలీస్ స్టేషన్ లో వేసి కొట్టాడని, తనను శారీరకంగా వాడుకున్నాడని ఆమె ఆరోపించింది. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీపై కీలక ప్రకటన.. ఒకే విడతలో..
తాను మూడు నెలల గర్భిణిగా ఉన్నానని కూడా చూడకుండా తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, దీంతో తన గర్భం కూడా పోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన పాపను గదిలో వేసి, బంధించి, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శిపై కాల్పులు, దారుణ హత్య.. ఓవైసీ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్ లో దిశా చట్టం అమలవుతుందా లేదా అంటూ బాధితురాలు ప్రశ్నించింది. న్యాయం కోసం ఎస్ దగ్గరకు వెళ్తే, సీఐ దగ్గరకు వెళ్లాలని సూచించారని, తాను ఎస్పీ ఆఫీసుకు వెళ్లిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. కానిస్టేబుల్ వెంకట్ నాయక్ వల్ల ఎంతో మందికి అన్యాయం జరిగిందని ఆమె అన్నారు. ఒకే డిపార్ట్ మెంట్ కాబట్టి కానిస్టేబుల్ పై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మీడియానే తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.