సోమవారంనాడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆయనకు 102 డిగ్రీల జ్వరం వచ్చింది. దీంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్.కే.) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వాక్సిన్ తొలి డోసు చేయించుకున్నారు.
ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే ఆర్.కే. అదేరోజు అర్థరాత్రి నుంచి 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ తన నివాసంలోనే చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రానికి తాను తిరిగి కోలుకుంటానని, జ్వరం తగ్గగానే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు ఎమ్మెల్యే ఆర్.కే.తెలిపారు.
సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆర్కే కోవిడ్ మొదటి డోసు వాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఒక 10 లేదా 15 రోజుల క్రితం నుండి మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 50కి పైగా కారోన కేసులు రావటం దురదృష్టకరం అని అన్నారు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని అన్నారు. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకి దాదాపు 50 నుండి 100 మందికి వాక్సిన్ వేస్తున్నారని అన్నారు. కారోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరుకాలేనని అన్నారు.