
పులివెందులలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మోడల్ టౌన్, వాటర్ గ్రిడ్ పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్ స్టేడియం పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. రూ.635 కోట్లతో పులివెందులను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు. చిత్రావతి బ్యారేజ్ నుంచి చెరువులు నింపుతామని సీఎం హామీ ఇచ్చారు. ఎంత చేసినప్పటికీ పులివెందుల వాసుల రుణం తీర్చుకోలేనని జగన్ అన్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ కోసం రూ.154 కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు. రూ. 30 కోట్లతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ వెల్లడించారు. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Also Read:రెండేళ్ల పాలనలో రైతు పక్షపాతిగానే వున్నా.. కరోనా కాలంలోనూ పెట్టుబడి సాయం: జగన్
అంతకుముందు రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, జలయజ్ఞంతో రాష్ట్ర రూపురేఖలను మార్చిన ఘనత వైఎస్‌ఆర్‌ది అని సీఎం జగన్ గుర్తుచేశారు. మనది రైతుపక్షపాత ప్రభుత్వమని, రెండేళ్లలో రైతుల కోసం రూ.8,670 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలబడ్డామని సీఎం జగన్ తెలిపారు.