చంద్రబాబు ఆర్థిక నేరగాడు... ఇప్పట్లో బెయిల్ రానే రాదు : వైసిపి ఎమ్మెల్యే సంచలనం (వీడియో)

Published : Oct 17, 2023, 02:46 PM IST
చంద్రబాబు ఆర్థిక నేరగాడు... ఇప్పట్లో బెయిల్ రానే రాదు : వైసిపి ఎమ్మెల్యే సంచలనం (వీడియో)

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఇప్పట్లో బెయిల్ వచ్చే ప్రసక్తే లేదని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. 

మంగళగిరి : స్కిల్ డెవలప్ మెంట్ తో అనేక కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పట్లో జైల్లోంచి బయటకు వచ్చే అవకాశాలు లేవని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తీవ్రమైన ఆర్థిక నేరాలకు చంద్రబాబు పాల్పడ్డారు... ఆ కేసులు చాలా కఠినమైనవి కావడంతో ఆయనకు ఇప్పట్లో బెయిల్ రాదని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేసారు. 

గతంలోనే చంద్రబాబు అవినీతి అక్రమాలపై 40 కి పైగా కేసులు వేసినట్లు ఎమ్మెల్యే ఆళ్ల తెలిపారు. రాజధాని అమరావతి పేరిట దళిత ఎస్సీ, ఎస్టీలతో పాటు వెనుకబడిన మైనారిటీ, బిసి ల భూములను కూడా చంద్రబాబు లాక్కున్నాడని... వాటిని తన బినామీలకు పంచారన్నారు. ఇలా పేదల జీవితాలపై కొడుతూ  చంద్రబాబు చేసిన భూ దోపిడీలు మామూలుగా లేవని ఆళ్ల ఆరోపించారు. 

వీడియో

POA యాక్ట్, POT యాక్టుల ప్రకారం చంద్రబాబు ఆర్థిక నేరగాడని ఎమ్మెల్యే అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడి జైలుకి వెళ్లిన చంద్రబాబుకు కేవలం నెల రోజుల్లోనే బెయిల్ వచ్చే ప్రసక్తే లేదని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల పేర్కొన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu