వైసీపీ మేయర్ అభ్యర్థులను ఖరారు చేసిన జగన్: జాబితా ఇదే...

Published : Mar 15, 2021, 05:03 PM ISTUpdated : Mar 15, 2021, 05:13 PM IST
వైసీపీ మేయర్ అభ్యర్థులను ఖరారు చేసిన జగన్: జాబితా ఇదే...

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కార్పోరేషన్ల ఎన్నికలకు సంబంధించి వైఎస్ జగన్ వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేశారు. మేయర్ పదవులు వైసీపీ నుంచి దక్కే జాబితా ఒక్కటి వెలుగు చూసింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కార్పోరేషన్ల ఎన్నికల్లో వైసీపీ మేయర్ అభ్యర్థుల జాబితా ఖరారైనట్లు తెలుస్తోంది. ఆ జాబితాను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మేయర్ అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత ఇప్పటికే కసరత్తు చేశారు. అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ఆయన రూపొందించినట్లు తెలుస్తోంది. ఆ విషయంపై ఆయన సోమవారం మంత్రులతోనూ పార్టీ ముఖ్య నేతలతోనూ చర్చించారు. 

వారి అభిప్రాయాల మేరకు తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మేయర్ అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలను, రిజర్వేషన్లను, మంత్రూలూ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల అభిప్రాయాలను పరిగగణలోనికి తీసుకుని జాబితాను రూపొందించినట్లు సమాచారం. 

ఆ జాబితా ఇదే...

1. ఒంగోలు - సుజాత 
2. గుంటూరు - మనోహర్ నాయుడు (ఈయన రెండున్నరేళ్లు మాత్రమే మేయర్ పదవిలో ఉండే అవకాశం ఉంది. మిగతా రెండున్నరేళ్లు మరొకరు మేయర్ గా ఉంటారు.
3. విశాఖ - వంశీకృ్ణ శ్రీనివాసు
4. కర్నూలు - బివై రామయ్య
5. కడప - కే సురేష్ బాబు
6. తిరుపతి శిరీష
7. విజయవాడ - భాగ్యలక్ష్మి
8. విజయనగరం మేయర్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు.

ఏపీలోని కార్పోరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు, మున్సిపాలిటీల చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నికుల ఈ నెల 18వ తేదీన జరగనుంది. రాష్ట్రంలోని కార్పోరేషన్లలో వైసీపీ విజయ దుందుభి మోగించింది. మైదుకూరు, తాడిపత్రి మినహా మిగతా మున్సిపాలిటీలన్నింటిలో వైసీపీ విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీల చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్ పదవులను వైసీపీ సొంతం చేసుకోనుంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!