టీడీపీ అభ్యర్థికి చాలా తక్కువ ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ పరిస్థితి కూడా అలానే ఉంది. పవన్ మానియా కూడా ఏ మాత్రం పనిచేసినట్లు కనపడకపోవడం గమనార్హం.
తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ లో వైసీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. టీడీపీ అభ్యర్థికి చాలా తక్కువ ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ పరిస్థితి కూడా అలానే ఉంది. పవన్ మానియా కూడా ఏ మాత్రం పనిచేసినట్లు కనపడకపోవడం గమనార్హం.
తిరుమలలో వైసీపీ భారీ ఆధిక్యతలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా తెలిపారు. సుమారు రెండు వేల పైచిలుకు వైసీపీ మెజారిటీలో ఉంది. దీంతో కౌంటింగ్ కేంద్రం బయట ఉన్న వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి అనుచరులు, నేతలు, వైసీపీ కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు. అప్పుడే సంబరాలు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఆధిక్యతపై తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ.. ఏ పార్టీకి ఏజెంట్లు లేకుండా వన్‌సైడ్‌గా పోలింగ్ జరిగిందని విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. ఎన్నికల రోజు ఎన్నికల ఏజెంట్ తనను కూడా స్వయంగా తిరుమలకు పంపలేదని ఆమె చెప్పుకొచ్చారు.