తమ్ముడి ప్రాణాలు కాపాడపోయి...

Published : May 02, 2021, 09:20 AM ISTUpdated : May 02, 2021, 09:23 AM IST
తమ్ముడి ప్రాణాలు కాపాడపోయి...

సారాంశం

వీరిద్దరూ వంశధార నదిలో నీరు తెచ్చుకొనే రేవు వద్ద స్నానం చేసేందుకు కలిసి వెళ్లారు. నీటిలో దిగి కాసేపు ఆడుకున్నారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో దినేష్ నీటిలో మునిగిపోతుండటాన్ని ప్రశాంతి గమనించింది.

తోడబుట్టిన తమ్ముడి ప్రాణాలు కాపాడబోయి ఓ అక్క ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక సంఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

కొత్తూరు మండలానికి చెందిన నక్క భాస్కరరావు, సుజాత దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరికి కుమార్తె ప్రశాంతి(13), కుమారుడు దినేష్(10) ఉన్నారు. వీరిద్దరూ వంశధార నదిలో నీరు తెచ్చుకొనే రేవు వద్ద స్నానం చేసేందుకు కలిసి వెళ్లారు. నీటిలో దిగి కాసేపు ఆడుకున్నారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో దినేష్ నీటిలో మునిగిపోతుండటాన్ని ప్రశాంతి గమనించింది.

వెంటనే.. తమ్ముడిని పట్టుకొని కాపాడే ప్రయత్నం చేసింది. అతి కష్టం మీద ఈది.. తమ్ముడిని ఒడ్డుకు చేర్చింది. అయితే.. ఆ సమయంలో ప్రశాంతి నీళ్లు ఎక్కువగా తాగేసింది. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. సమీపంలో ఉన్న స్థానికులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే హిరమండలం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రశాంతి మృతి చెందింది.

కాగా.. అప్పటి వరకు ఇంట్లో సరదగా గడిపిన పిల్లలు.. కొద్ది గంట్లో ఒకరు శవమై ఇంటికి రావడం ఆ కుటుంబ సభ్యులను కలచివేసింది. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఒకేసారి 5 అల్పపీడనాల అటాక్.. ఈ ప్రాంతాల్లో తుపానులు, భారీ వర్షాలతో అల్లకల్లోలమే..!
ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగదు..మహిళా రిజర్వేషన్ బిల్లు పై Chandrababu Reaction | Asianet News Telugu