నేడు టీడీపీలోకి వైసీపీ సీనియర్ నేత

Published : Sep 15, 2018, 01:00 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
నేడు టీడీపీలోకి వైసీపీ సీనియర్ నేత

సారాంశం

మరో వైసీపీ సీనియర్ నేత టీడీపీలోకి అడుగుపెట్టేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్‌ నాయకుడు మీసాల నీలకంఠంనాయుడు ఈ రోజు వైసీపీని వీడి టీడీపీలోకి అడుగుపెట్టనున్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఎచ్చెర్ల వస్తున్నందున మధ్యాహ్నం 2 గంటలకు ఆయన సమక్షంలో తన అనుచరవర్గంతో కలిసి పార్టీ తీర్థం తీసుకుంటానని నీలకంఠం నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం తన స్వగ్రామం ఎస్పీఆర్‌పురం స్వగృహంలో వెల్లడించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు ఆధ్వర్యంలో సీఎం చేతుల మీదుగా పార్టీ కండువా వేసుకోనున్నట్లు చెప్పారు. టీడీపీలో చేరిక విషయమై గత సోమ వారం మంత్రి కళావెంకటరావు, మీసాల భేటి అయిన సంగతి తెలిసిందే

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే