వ్యక్తి దారుణ హత్య: భార్యపై అనుమానం, వివాహేతర సంబంధమే కారణమా...?

Published : Sep 15, 2018, 12:26 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
వ్యక్తి దారుణ హత్య: భార్యపై అనుమానం, వివాహేతర సంబంధమే కారణమా...?

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లె సమీపంలోని మామిడి తోపులో గురువారం రాత్రి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లె సమీపంలోని మామిడి తోపులో గురువారం రాత్రి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు.

వెంగంపల్లెకు చెందిన మొగిలిరెడ్డి(45) వ్యవసాయంతో పాటు మామిడి కాయలు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి వెంగంపల్లె సమీపంలో మామిడి తోపు ఉంది. పాడి ఆవు ఈనుతుందని భావించిన మొగిలిరెడ్డి, అతని భార్య మమత గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మామిడి తోపు వద్దకు వెళ్లారు. అక్కడే నిద్రించారు. 

అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మొగిలిరెడ్డి తలపై, ఇతరు శరీరావయవాలపై దారుణంగా కొట్టారు. ఆ తర్వాత గుడ్డతో గొంతు బిగించి చంపేశారు. శుక్రవారం ఉదయం కొడుకు రోహిత్‌రెడ్డి మామిడి తోపు వద్దకు వెళ్లి చూడగా తండ్రి మంచంపై ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. 

వెంటనే పక్క పొలంలోనే ఉన్న మేనత్త రాజమ్మకు, బంధువులకు తెలిపాడు. సమాచారం అందుకున్న చిత్తూరు డీఎస్పీ సుబ్బారావు, చిత్తూరు ఈస్ట్‌ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు పరిశీలించారు.

పోలీసు జాగిలం హత్యా స్థలం నుంచి నేరుగా హతుడి ఇంటి వద్ద తలుపు, బాత్‌రూం వద్దకు వచ్చి ఆగింది. డీఎస్పీ సుబ్బారావు నేతృత్వంలో మొగిలిరెడ్డి భార్య మమత, కూతురు భార్గవి, కుమారుడు రోహిత్‌ రెడ్డి, గ్రామస్తులను వేర్వేరుగా విచారించారు. తాను మంచం పక్కనే పడుకున్నానని, చీకటిలో భర్తపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని, దాంతో భయపడి పారిపోయానని భార్య పోలీసులకు తెలిపింది. 

పోలీసులు మాత్రం హత్యకు భార్య వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భార్య, మరో వ్యక్తిని విచారిస్తున్నారు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి అక్క రాజమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Inspirational Speech About Dr BR Ambedkar and Abdul Kalaam | Asianet Telugu
తిరుమల మెట్లెక్కిన 116ఏళ్ల బామ్మకి VIP బ్రేక్ దర్శనం | Asianet News Telugu