అది తన సర్వే కాదంటున్న లగడపాటి

Published : Sep 15, 2018, 12:23 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
అది తన సర్వే కాదంటున్న లగడపాటి

సారాంశం

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై, నామినేషన్ల ప్రక్రియ తర్వాతే జననాడిని తెలుసుకునే ప్రయత్నం చేసి, సర్వే ఫలితాలను వెల్లడిస్తానని వివరించారు. అంతవరకూ తన పేరిట ఏ ప్రచారం జరిగినా.. అవి కేవలం వేరొకరి కల్పితాలేనని స్పష్టం చేశారు.

తెలంగాణ, ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో వీరిదే విజయం అంటూ రెండు రోజుల నుంచి ఓ సర్వే వెల్లడించిన విషయాలు వైరల్ గా మారాయి. అయితే.. ఆ సర్వే చేయించింది మాజీ ఎంపీ లగడపాటి రాజ్ గోపాల్ అంటూ ప్రచారం కూడా జరిగింది. కాగా.. ఈ విషయాన్ని లగడపాటి ఖండించారు.

శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆ సర్వే గురించి క్లారిటీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఆ సర్వే ఫలితాలకు, తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై, నామినేషన్ల ప్రక్రియ తర్వాతే జననాడిని తెలుసుకునే ప్రయత్నం చేసి, సర్వే ఫలితాలను వెల్లడిస్తానని వివరించారు. అంతవరకూ తన పేరిట ఏ ప్రచారం జరిగినా.. అవి కేవలం వేరొకరి కల్పితాలేనని స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే