వైసిపిలోకి కాంగ్రెస్ నేతలు..టిడిపికి షాక్

First Published Feb 24, 2018, 3:59 PM IST
Highlights
  • నియోజకవర్గాల సంఖ్య పెరగేది లేదని తేలిపోవటంతో పలువురు కాంగ్రెస్ నేతలు చూపు ఇపుడు వైసిపి వైపు చూస్తున్నారు.

నియోజకవర్గాల సంఖ్య పెరగేది లేదని తేలిపోవటంతో పలువురు కాంగ్రెస్ నేతలు చూపు ఇపుడు వైసిపి వైపు చూస్తున్నారు. వీరిలో కొందరిని తనవైపు తిప్పుకోవాలని టిడిపి ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావటం లేదు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పలువురు కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వస్తున్నట్లు సమాచారం. జగన్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ నేతల్లో మాజీ మంత్రులుండటం గమనార్హం.

 నియోజకవర్గాల సంఖ్య పెరిగితే టిడిపిలో చేరాలని అనుకున్న కాంగ్రెస్ నేతలు ఇపుడు ఆ నిర్ణయాన్న విరమించుకున్నారట. టిడిపిలోకి వెళ్ళి ఉపయోగం లేదు. కాంగ్రెస్ తరపున వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తే ఉపయోగం ఉండదనుకున్న నేతలందరూ వైసిపినే బెటర్ ఆప్షన్ అనుకుంటున్నారట.

అటువంటి నేతల్లో ముందుగా కందుకూరులో మానుగుంట మహీధర్ రెడ్డిని చెప్పుకోవాలి. మానుగుంట వైసిపిలో చేరటం దాదాపు ఖాయమైపోయింది. ముహూర్తమే ఎప్పుడన్నది సస్పెన్స్. అదే దారిలో  శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళి, డీఎల్ రవీంద్రారెడ్డి పేర్లు వినబడుతున్నాయి. డిఎల్ చాలా కాలంగా ఏ పార్టీలో చేరాలా అన్న ఊగిసలాటలో ఉన్నారు. ఒకసారి టిడిపిలో చేరుతారని, మరోసారి వైసిపిలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ నుండి వైసిపిలోకి చేరాలని అనుకుని కబురు చేస్తున్న నేతల జాబితాపై జగన్-ప్రశాంత్ కిషోర్ చర్చించుకున్నారట. అటువంటి నేతలపై ఒకసారి సర్వే చేయాలంటూ ప్రశాంత్ కు జగన్ బాధ్యత అప్పగించారట. కాంగ్రెస్ నుండి వచ్చే నేతలు వైసిపిలో చేరితో  ఎంతవరకు లాభం, అటువంటి వారికి టిక్కెట్లు ఇస్తే  విజయావకాశాలు ఎలా ఉంటాయి?  అన్నదానిపై పీకే టీం సర్వే చేస్తోందట. పికె సర్వే నివేదిక అందిన తర్వాత జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వైసీపీలో భారీగా చేరికలుంటాయని సమాచారం.

click me!