జ్యుడీషియల్ కాంప్లెక్స్ డిజైన్..టిఆర్ఎస్ భవన్ కాపీయేనా ?

First Published Feb 24, 2018, 2:09 PM IST
Highlights
  • చంద్రబాబునాయుడు ప్రభుత్వం రాజధానిలో ఏవి నిర్మంచాలనుకున్నా వివాదాస్సదమవుతూనే ఉంది

చంద్రబాబునాయుడు ప్రభుత్వం రాజధానిలో ఏవి నిర్మంచాలనుకున్నా వివాదాస్సదమవుతూనే ఉంది. రాజధాని నిర్మాణం అన్నా కోట్ల రూపాయలు పోసి డిజైన్లు గీయించారు. తీరూ చూస్తే ఆ డిజైన్లు ఎక్కడో చూసినట్లుందే అని జనాలు అనుకోవటం మొదలుపెట్టారు. కాబట్టి ఆ డిజైన్లను మార్చేసారు. ఇప్పటికి డిజైన్లు ఎన్నిసార్లు మారాయో లెక్కలేదు. సచివాలయం కావచ్చు, అసెంబ్లీ కావచ్చు. ప్రతీ నిర్మాణం డిజైను కూడా ఎక్కడో కాపీ కొట్టినట్లే కనబడుతోంది.

తాజాగా జ్యుడీషియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం 12 రకాల డిజైన్లను చంద్రబాబు గీయించారు. శనివారం వాటి తాలూకు డిజైన్లను సిఆర్డిఏ వెబ్ సైట్లో ఉంచారు. జనాల అభిప్రాయాలను కోరారు. అయితే, అందులో జనాలను ఆకట్టుకునే రీతిలో ఉన్న డిజైన్లు చాలా తక్కువ. పైగా 12 డిజైన్ల చూడగానే ఎక్కడో చూసినట్లే ఉందే అని అనిపించక మానదు. కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే ఆప్షన్ 12వ డిజైన్ హైదరాబాద్ లోని టిఆర్ఎస్ భవన్ డిజైన్ కు దగ్గరలో ఉండటం గమనార్హం. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పోసి ఆర్కిటెక్టులకు ఇస్తున్నది కాపీ డిజైన్లను ఇవ్వటానికా అని జనాలు అనుకుంటే అది వారి తప్పు ఎంతమాత్రం కాదు. ఏమంటారు?

click me!