జగన్ కి వెయ్యి కార్లతో కార్యకర్తల స్వాగతం

Published : Nov 25, 2018, 08:29 AM IST
జగన్ కి వెయ్యి కార్లతో  కార్యకర్తల స్వాగతం

సారాంశం

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నేటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేయనున్నారు. 

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నేటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేయనున్నారు. కాగా.. ఆయన ఈ రోజు శ్రీకాకుళంలో అడుగుపెట్టే సమయంలో.. వెయ్యి కార్లతో ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి  ఏర్పాట్లు చేశారు. కార్లతో సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

విజయనగరంలో ఈ యాత్రను ముగిం చుకుని ఆదివారం సాయంత్రానికి  శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండలం కరకెల్ల గ్రామానికి జగన్ చేరుకోనున్నారు. ఈ జిల్లాలో వచ్చే నెల 3వ తేదీ వరకు జగన్.. పాదయాత్ర కొనసాగునుందని పార్టీ నేతలు తెలిపారు. ఈ పాదాయాత్రలో జగన్ సమక్షంలో ఇతర పార్టీ నేతలను భారీ సంఖ్యలో తమ పార్టీలోకి చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే