‘‘నీ బాగోతం అంతా మా చేతుల్లో ఉంది’’.. వైసీపీ నేతలు ఫైర్

Published : Oct 06, 2018, 11:40 AM IST
‘‘నీ బాగోతం అంతా మా  చేతుల్లో ఉంది’’.. వైసీపీ నేతలు  ఫైర్

సారాంశం

ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి లేదన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నుడా చైర్మన్‌గా ఎక్కడెక్కడ ఎంత అక్రమ వసూళ్లు చేస్తున్నారో, దందాలు నిర్వహిస్తున్నారో తమ వద్ద చరిత్ర ఉందన్నారు.

నుడా(నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిపై వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. నీ అవినీతి భాగోతమంతా మా చేతుల్లో ఉందని, రోజుకో ఎపిసోడ్‌ చొప్పున విడుదల చేస్తాం తట్టుకుంటావా..? అంటూ వైసీపీ నేతలు, డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్‌, ఎన్‌ఎంసీ ఫ్లోర్‌లీడర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌లు నుడా ఛైర్మన్ కి సవాల్ విసిరారు.

శుక్రవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని డిప్యూటీ మేయర్‌ చాంబరులో వారు విలేకరతో మాట్లాడుతూ నుడా చైర్మన్‌గా సాధించిన అభివృద్ధిని చెప్పాలని డిమాండ్‌ చేశారు. సిటీ ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి లేదన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నుడా చైర్మన్‌గా ఎక్కడెక్కడ ఎంత అక్రమ వసూళ్లు చేస్తున్నారో, దందాలు నిర్వహిస్తున్నారో తమ వద్ద చరిత్ర ఉందన్నారు. నెల్లూరు నగరంలో నిర్మిస్తున్న షేర్‌వాల్‌ టెక్నాలజీ ఇళ్లకు ఇంతటి ఆర్థిక భారమెందుకు మోయాల్సి వస్తుందని మంత్రి నారాయణను ప్రశ్నించారు. పరిజ్ఞానంతో నిర్మాణాలు చేసినప్పుడు వ్యయం తగ్గాలే తప్ప పెరగకూడదన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?