చంద్రబాబుని ఎన్ కౌంటర్ చేయండి.. నటుడు శివాజీ సంచలన కామెంట్స్

Published : Oct 06, 2018, 10:35 AM IST
చంద్రబాబుని ఎన్ కౌంటర్ చేయండి.. నటుడు శివాజీ సంచలన కామెంట్స్

సారాంశం

తాజాగా రాష్ట్రంలో ఐటీ దాడులు జరగడానికి వెనుక ఒక వ్యక్తి చక్రం తిప్పాడని ఆరోపించారు. ఆ ఒక్కడే మొత్తం సమాచారాన్ని ఐటీ అధికారులకు ఇచ్చారన్నారు.

సినీ నటుడు శివాజీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలు కావాలనే కక్ష్య ఏపీసీఎం చంద్రబాబుపై కక్ష కట్టారని ఆరోపించారు. ‘మీ టార్గెట్‌ చంద్రబాబు. దానికోసం రాష్ట్ర ప్రజలను హింసించే బదులు ఆయన్ను ఒకేసారి ఎన్‌కౌంటర్‌ చేయండి. చంద్రబాబుపై కోపంతో ఆంధ్ర ప్రజలకు అన్యాయం ఎందుకు చేస్తున్నారు?’’ అని ప్రధాని మోదీని, బీజేపీని నటుడు శివాజీ నిలదీశారు. 

నలుగురు దుర్మార్గులు ఢిల్లీలో కూర్చుని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. మొన్న తెలంగాణలో రేవంత్‌రెడ్డి, తాజాగా రాష్ట్రంలో ఐటీ దాడులు జరగడానికి వెనుక ఒక వ్యక్తి చక్రం తిప్పాడని ఆరోపించారు. ఆ ఒక్కడే మొత్తం సమాచారాన్ని ఐటీ అధికారులకు ఇచ్చారన్నారు.

మంత్రుల ఇళ్లలోనూ సోదాలు చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, వారు అప్రమత్తమై సేఫ్‌జోన్‌లోకి వెళ్లారని చెప్పారు. దేశంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న రాఫెల్‌ కుంభకోణాన్ని దారిమళ్లించడానికే ఐటీ దాడులు చేయిస్తున్నారన్నా రు. ఎవరు ఊరుకున్నా ఈ విషయంలో మాత్రం తాను మౌనం వహించే ప్రసక్తి లేదని చెప్పారు. ర్యాలీ నిర్వహించి ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేస్తానన్నా రు. 

‘నాలుగు మాటలు మాట్లాడితే పడిపోయే జీవీఎల్‌ ఆంధ్ర ప్రజల మంచితనం వల్లే ఇక్కడ తిరుగుతున్నారు. జీవీఎల్‌ ఈవిధంగా మాట్లాడుతూ తెలంగాణలో తిరగగలడా’ అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా సాధన కోసం ‘హోదా సైన్యాన్ని’ తయారు చేస్తున్నానని శివాజీ తెలిపారు.

 నవంబరు 2న ఈ సైన్యంతో రాష్ట్ర రహదారులపై ఆందోళనలు నిర్వహిస్తానన్నారు. ‘‘టీటీడీలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ఇప్పుడు సుబ్రహ్మణ్యంస్వామిని వదిలారు. వాడో సన్నాసి. ఎవరైనా తిరుమల జోలికి వస్తే నరికేస్తా’ అని హెచ్చరించారు. పవన్‌ కల్యాణ్‌ తప్పుడు, చెప్పుడు మాటలు విని హోదా విషయాన్ని వదిలేశారన్నారు.

PREV
click me!

Recommended Stories

Tirumala Vaikunta Dwaram: టికెట్ లేని భక్తులకు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు| Asianet News Telugu
ఫ్యూచర్ కోసం ఈ ఏడాది రిజల్యూషన్ తీసుకుందాం: Doctor Ratna Pemmasani | Plastic | Asianet News Telugu