టీవీ సీరియళ్లపై కామెంట్ చేసిన జేసీ

By ramya neerukondaFirst Published Oct 6, 2018, 10:22 AM IST
Highlights

అసూయ, ఈర్ష్య, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు పెరిగే అవకాశాలున్నాయన్నారు. మానవ సం బంధాలు కూడా తగ్గిపోయేవిధంగా సీరియల్స్‌ ఉన్నాయన్నారు.
 

ఏదో ఒక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసి.. వార్తలోకి ఎక్కడంలో జేసీ సోదరులు ముందుంటారు. తాజాగా అనంతపురం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ టీవీ సీరియళ్లపై కామెంట్ చేశారు.

ఇంతకీ మ్యాటరేంటంటే..  అనంతపురం పట్టణంలోని జేసీ నాగిరెడ్డి షాదీఖానాలో శుక్రవారం దుల్హన్ పథకం మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జేసీ ప్రభాకర్.. మహిళలను ఉద్దేశించి ఓ ప్రశ్న వేశారు.

ప్రస్తుతం వస్తున్న టీవీ సీరియళ్లలో నీతి ఉందా? అని మహిళలను ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.కేవలం ధనార్జనే ధ్యేయంగా టీవీ సీరియళ్లు, ప్రోగ్రాంలు ఉంటున్నాయన్నారు. వీటివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకపోగా అసూయ, ఈర్ష్య, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు పెరిగే అవకాశాలున్నాయన్నారు. మానవ సం బంధాలు కూడా తగ్గిపోయేవిధంగా సీరియల్స్‌ ఉన్నాయన్నారు.
 
 అనంతరరం దుల్హన్ పథకం గురించి ప్రస్తావించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మైనార్టీల కోసం దుల్హన్‌ పథకం ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం ద్వారా వచ్చే రూ.50 వేలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడమో, స్వయం సమృద్ధి కోసం ఉపయోగించడమో చేయాలన్నా రు. మహి ళల్లో వందశాతం అక్షరాస్యత ఉన్నపుడే అభివృద్ధి సాధ్యమ వుతుందన్నారు. ముస్లిం మహిళలు అక్షరాస్యతపై దృష్టి పె ట్టాలన్నారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జిలాన్‌బాషా మాట్లాడు తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మైనార్టీల అ భివృద్ధి కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నా రన్నారు. అనేక పథకాల ద్వారా వారికి చేయూతనిస్తున్నారన్నారు. స్వయం ఉపాధి కోసం కుట్టుశిక్షణ, పంపిణీ, కంప్యూటర్ల శిక్షణ ద్వారా మహిళలకు ఉపయోగపడుతున్నారన్నారు.

click me!