ధర్మవరంలో ఉద్రిక్తత.. బీజేపీ నేతలపై కర్రలతో వైసీపీ వర్గీయుల దాడి..

By SumaBala BukkaFirst Published Jun 28, 2022, 2:07 PM IST
Highlights

బీజేపీ నేతల మీద వైసీపీ వర్గీయులు దాడి చేయడంతో ధర్మవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  

ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ప్రెస్ క్లబ్ ఆవరణలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బిజెపి నేతలపై వైసీపీ వర్గీయులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బిజెపి నేతలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే రక్తం కళ్లచూశారు. మూడు వాహనాల్లో వచ్చిన వైసీపీ శ్రేణులు విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. ధర్మవరం పట్టణ బిజెపి అధ్యక్షుడు రాజు, ఆ పార్టీ కార్యదర్శి రాము సహా మరికొందరికి గాయాలయ్యాయి. 

వారిని పోలీసులు ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత అనంతపురం తీసుకువెళ్లారు. ధర్మవరం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశానికి సన్నద్ధం అవుతుండగా వైసిపి కార్యకర్తలు, స్థానిక నేతలు ఒక్కసారిగా దాడి చేసినట్లు బిజెపి నాయకులు చెప్పారు. నిన్న నియోజకవర్గ ప్లీనరీ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు దాడికి పాల్పడ్డ వారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణం దాటి వెళ్లకుండా చెక్ పోస్ట్ లను అలర్ట్ చేశారు. 

నాకు కూడా స్వంత పార్టీ నేతలతో ఇబ్బందులు: నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఇదిలా ఉండగా, తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సోమవారం చెప్పుకొచ్చారు. తనపై ఆరోపణలు చేసే వారితో తమ పార్టీ నేతలు కొందరు టచ్లో ఉన్నారని మాజీ మంత్రి ఆరోపించారు. తాను తప్పు  చేశాను అని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కూడా ఆయన స్పష్టం చేశారు. సోమవారం నాడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనను కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్నారు.  జనసేన మహిళా నేత విషయంలో టిడిపి నేతల ప్రమేయం ఉందన్నారు. 

తన తప్పు ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన వారితో వైసీపీ నేతలు కూడా టచ్లో ఉన్నారని అన్నారు. తనపై ఆరోపణలు ఎవరు చేస్తున్నారో తనకు బాగా తెలుసునన్నారు. వాళ్ల సంగతి చూస్తాను అని కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. చెన్నైలో పట్టుబడ్డ డబ్బున్న తనకు ఆపాదిస్తున్నారు అన్నారు. తనపై జరుగుతున్న కుట్రపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. కాల్ డేటా ఆధారంగా విచారణ చేయాలని ఎస్పీని కోరతానని శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పవన్ రిక్వెస్ట్ తోనే  కేసును ఉపసంహరించుకున్నామని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వివరించారు.
 

click me!