ఆస్తి కోసం అన్నను చంపించిన చెల్లెలు, సహకరించిన తల్లి...

By SumaBala BukkaFirst Published Jun 28, 2022, 1:24 PM IST
Highlights

కర్నూలులో దారుణ ఘటన జరిగింది. ఆస్తి కోసం సొంత అన్ననే ఓ చెల్లెలు చంపించింది. దీనికి తల్లి కూడా సహకరించడం దారుణం. 

కర్నూలు : దిన్నెదేవరపాడుకు చెందిన మాధవస్వామి murder case మిస్టరీ వీడింది. ఆస్తికోసం తల్లి, అతని చెల్లెలు ఘాతుకానికి పాల్పడ్డారు. పక్కా ప్రణాళికతో హత్య చేయించారు. పోలీసుల దర్యాప్తులో ఇది బయటపడింది. వివరాలను నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో కర్నూలు తాలూకా సీఐ శేషయ్యతో కలిసి kurnool డీఎస్పీ కె.వి. మహేష్ సోమవారం వెల్లడించారు. మాధవస్వామికి గ్రామంలో పెద్దల ద్వారా సంక్రమించిన రూ. 60 లక్షల విలువ చేసే 30 సెంట్ల స్థలం ఉంది. దీనిని అమ్మేందుకు తల్లి ఎల్లమ్మ, చెల్లెలు నిర్మలమ్మ ప్రయత్నిస్తుండగా మాధవస్వామి ఒప్పుకోలేదు. 

దీంతో వారు అతనిమీద కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పక్కా ప్రణాళిక రూపొందించారు. మాధవస్వామిని చంపేందుకు నిర్మలమ్మ తన ప్రియుడు మాదిగ లక్ష్మన్నతో ఒప్పందం చేసుకున్నారు. హత్యకు ముందు రూ.10 వేలు ఇచ్చేలా.. పని పూర్తయ్యాక 3 సెంట్ల స్థలం లేదా స్థలానికి తగ్గ డబ్బులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 13 వ తేదీన రాత్రి మద్యం తాగేందుకు మాధవస్వామిని లక్ష్మన్న తీసుకెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా మాధవస్వామి మీద దాడి చేసి గొంతు కోసం చంపేశాడు. నిర్మలమ్మ, లక్ష్మన్న సంభాషణలు ఉన్న వాయిస్ రికార్డు, హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలతో ఉన్న నిందితుడి దుస్తులు, మోటార్ సైకిల్ తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. 

చెట్టుకు ఉరివేసుకుని మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య... ఇంట్లో తెలియడంతో దారుణం...

ఇదిలా ఉండగా, ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేసిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష,వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ నగరంలోని పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి లాలం శ్రీధర్ సోమవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలాది శ్రీనివాసు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు నాగరాజు (42) ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చట్టుబంద గ్రామానికి చెందిన వాడు. వృత్తి వ్యవసాయం.

మృతుడు కె మల్లేశ్వరరావు (28) కూడా అదే గ్రామానికి చెందిన వాడు. నేరం జరగడానికి ఆరు నెలల ముందే నాగరాజు కూలి పనుల నిమిత్తం చెన్నై వెళ్ళాడు. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత అతని ఇంట్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రేడియో, ఇంట్లోనే కొన్ని వస్తువులు కనిపించలేదు. వాటిని మల్లేశ్వరరావు దొంగిలించినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఇద్దరు గొడవ పడ్డారు. 2015 జూన్ 3న రాత్రి మల్లేశ్వరరావు లోతభీమయ్యకు చెందిన జీడి మామిడి తోటలోని పూరిపాకలో నిద్రపోతున్నాడు. ఇదే అదనుగా నాగరాజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెద్ద కర్రతో మల్లేశ్వరరావుపై దాడి చేసి తల, భుజం, ముక్కుపై బలంగా కొట్టాడు. 

తీవ్రగాయాలతో బాధపడుతున్న మల్లేశ్వరరావును అతని బంధువులు నర్సీపట్నం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి విశాఖ తరలించారు. చికిత్స పొందుతూ జూన్ 4న అతను మరణించాడు. మృతుని తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కొయ్యూరు పోలీస్ ఇన్స్పెక్టర్ జి. సోమశేఖర్, నర్సీపట్నం ఉప పోలీస్ సూపరింటెండెంట్ బి. సత్య ఏసుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు హత్యానేరంతోపాటు, గిరిజన చట్టం 3(2)(5)కింద కూడా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి రెండు నేరాల్లో యావజ్జీవ జైలు శిక్ష విధించారు. అయితే, 2 శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని ఆ తీర్పులో స్పష్టం చేశారు. 

 

click me!