కేంద్ర బడ్జెట్ పై మండిపడ్డ వైసీపీ నేత

By telugu teamFirst Published Jul 6, 2019, 1:37 PM IST
Highlights


కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై వైసీపీ నేత సి.రామచంద్రయ్య విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోనాలపై కొంచెం కూడా దృష్టి పెట్టకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారని మండిపడ్డాడు.
 

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై వైసీపీ నేత సి.రామచంద్రయ్య విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోనాలపై కొంచెం కూడా దృష్టి పెట్టకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారని మండిపడ్డాడు.

‘‘ కేంద్రం ఏడా పెడా పన్నులు పెంచింది. కేంద్రం ఆదాయాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఈ బడ్జెట్. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. రాష్ట్రాల ప్రయోజనాలపై కేంద్రం దృష్టి పెట్టలేదు. పెట్రోల్ ధరలు పెంచితే దాని ప్రభావం వివిధ రంగాలపై పడుతుంది. పూర్తి మెజారిటీ వచ్చిందనే దర్పముతో రాష్ట్రాలు అవసరం లేదనే విధంగా ప్రధాని నరేంద్రమోదీ వ్యవహరిస్తున్నారు.’’ అని మండిపడ్డారు.

‘‘మీడియాలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఫలితంగా దేశీయ మీడియా దెబ్బతింటుంది.  గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు.. విభజన చట్టంలో ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు.. పోలవరం నిధుల ప్రస్తావన లేదు.. రాజధాని నిధులు లేవు.. రైల్వేల విషయంలోనూ ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింద’’ని పేర్కొన్నారు.
 

click me!