చంద్రబాబు దళారి నాయకుడు, హెరిటేజ్ కోసమే ఆయన దళారిగా మారాడు : జగన్

First Published Jun 9, 2018, 6:38 PM IST
Highlights

ఇసుక మాఫియాలో ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో పాటు చినబాబుకు,పెద్దబాబుకు వాటా

చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో దళారులు రైతుల పొట్ట కొడుతున్నారని వైఎస్సార్ సిపి అధినేత ఆరోపించారు. ఈ దళారులకు సీఎం చంద్రబాబు నాయకుడిగా మారి రైతుల పంటలకు గిట్టబాటు ధర రాకుండా చూస్తున్నారని అన్నారు. ఆయన దోపిడీ ఎలా ఉందంటే..రైతుల వద్ద కూర అరటి గెల 100 రూపాయలకు గెల తీసుకునే చంద్రబాబు హెరిటేజ్ లో మాత్రం రెండు అరటి పండ్లు 25 రూపాలకు అమ్ముకుంటున్నాడని జగన్ అన్నారు. ఇలా ప్రతి రైతు పొట్ట కొడుతూ చంద్రబాబు దళారులకు కొమ్ముకాస్తూ పెద్ద దళారిగా మారాడని అన్నారు.  

పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించారు. అనంతరం నిడదవోలు రోడ్ షో లో జగన్ చిరుజల్లుల మద్యలోనే తన ప్రసంగం కొనసాగించారు. ఈ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి పార్టీని గెలిపించారు. అలాంటి ఈ జిల్లాకు  చంద్రబాబు ఏం చేశాడో చెప్పాలని ప్రజల్ని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్ల పాలనలో ఈ జిల్లా ప్రజలు సంతోషంగా ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. ఇలా పూర్తి మొజారిటీ ఇచ్చిన జిల్లానే చంద్రబాబు విస్మరించారిన, ఇక మిగతా చోట్ల పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలని జగన్ అన్నారు.

ఇక సహజ సంపద అయిన ఇసుకను చంద్రబాబు తన బినామీలకు ఫ్రీగా ఇస్తున్నాడని, వీరంతా కలిసి ఇసుకను లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. తన బినామీ లకు ఒక రేటు, ఇతర కాంట్రాక్టర్లకు మరో రేటుకు ఇసుక అమ్ముతున్నారని మండిపడ్డారు. ఇసుక మాఫియాను ఈ జిల్లా అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంటే వారిని శిక్షించకుండా వదిలిపెట్టారని ఆరోపించారు. ఈ ఇసుక అక్రమ అమ్మకాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లలతో పాటు చిన్న బాబు, పెద్ద బాబులకు వాటా వెలుతుందని జగన్ ఆరోపించారు. ఇసుకపనే ఈ నిడదవోలు నియోజకవర్గంలో మట్టిని కూడా అమ్ముకుంటున్నారని, ఈ మట్టి తవ్వకాల వల్ల 34 వేల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే మోసం చేశాడని జగన్ విమర్శించారు. కానీ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు ఈ నియోజకవర్గ పరిధిలో 10 వేల ఇండ్లు కట్టించారని, కేవలం నిడదవోలు పట్టణంలోనే వెయ్యి ఇండ్లు కట్టించారని గుర్తు చేశారు. ఇలాంటి గొప్ప నాయకుడి పాలనతో చంద్రబాబు పాలనను పోల్చవద్దని జగన్  ప్రజలకు సూచించారు.
 

ఇక హైటెక్ సీఎం అని చెప్పుకునే చంద్రబాబు సెల్ ఫోన్, కంప్యూటర్లను తానే కనిపెట్టానని నోటికొచ్చిన అబద్దాలు ఆడతారని జగన్ ఎద్దేవా చేశారు. ఇలా గొప్పలు చెప్పుకోవడం కాదని ఎన్నికలకు మందు టీవీ యాడ్ లలో చెప్పిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఇక ఆయనిచ్చిన రుణ మాపీ రైతుల వడ్డీలు కట్టడానికి కూడా పనిచేయలేదని జగన్ విమర్శించారు.ఇలా అబద్దపు ప్రచారాలు చేసే వారిన బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు సూచించారు జగన్.

 

click me!