కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వైసీపీ నేత..

By SumaBala BukkaFirst Published Jan 27, 2023, 9:29 AM IST
Highlights

కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఓ వైసీపీ నేత అరెస్టయ్యాడు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అతను వైసీపీ నేత కాదని ఎమ్మెల్యే చెప్పడం కొసమెరుపు. 

వైయస్సార్ జిల్లా : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు వరుసగా ఏదో ఒక కేసులో ఇరుక్కుంటున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ రాష్ట్ర బొందిలి కార్పోరేషన్ డైరెక్టర్, వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసిపి నాయకురాలు రజని దొంగనోట్ల కేసులో అరెస్టు అయిన సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే అలాంటిదే మరో వైసీపీ నేత ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం ఓ వైసీపీ నాయకుడు అక్రమ మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కాడు.

అక్రమ మద్యాన్ని తరలిస్తూ.. బ్రహ్మంగారి మండల వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ ఇండ్ల శివరాం పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి పోలీసులు రూ. 20  లక్షల విలువైన 50 కేసుల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమమద్యాన్ని ఆయన కాజీపేట మీదుగా  కారులో తన స్వగ్రామమైన బ్రహ్మంగారి మఠానికి  తరలిస్తూ పట్టుబడ్డాడు. పట్టుబడున నిందితుడితోపాటు కారును,  అక్రమ మద్యం కేసులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  

దొంగ నోట్ల చలామణి కేసులో వైసీపీ మహిళా నాయకురాలు రజని.. బెంగళూరులో అరెస్ట్..

వీటి కడప ఎస్పీ కార్యాలయానికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిమీద మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి  స్పందిస్తూ.. శివరాంకు వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అతనికి సోషల్ మీడియా కన్వీనర్ గా వైసీపీ నుంచి ఎలాంటి నియామక పత్రాలు ఇవ్వలేదని.. స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా, జనవరి 25న వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు రసపుత్ర రజిని దొంగనోట్ల వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టరుగా ఉన్నారు. వైసీపీ మహిళా నాయకురాలు వ్యవహరిస్తున్నారు. బెంగళూరులోని సుబ్రమణ్యపుర పోలీసులు దొంగ నోట్ల వ్యవహారంలో నోట్ల చలామణికి సంబంధించి రజినిని అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు పోలీసులు చరణ్ సింగ్‌ అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

రసపుత్ర రజిని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరగణంలోని వ్యక్తి. ప్రొద్దుటూరు వైసీపీలో రసపుత్ర రజిని కీలక నాయకురాలుగా చెబుతారు. ఈ కారణంగానే  ఆమెకు బొందిలి కార్పొరేషన్‌ డైరెక్ట పదవి దక్కినట్టుగా ప్రచారంలో ఉంది. 

click me!