విషాదం.. వెళ్లిన మూడు రోజులకే.. అమెరికాలో శ్రీకాకుళం యువకుడి దుర్మరణం..

By SumaBala BukkaFirst Published Jan 27, 2023, 8:23 AM IST
Highlights

అమెరికాలో జరిగిన ఓ ప్రమాదంలో శ్రీకాకుళానిక చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. ఉపాధి నిమిత్తం వెళ్లిన మూడు రోజులకు మృత్యువాత పడడం విషాదం. 

శ్రీకాకుళం : ఉన్న ఊరు, కన్నవారిని వదిలి బతుకుతెరువు కోసం పొట్ట చేత పట్టుకుని  దూర దేశాలకు వెళ్లిన ఓ యువకుడు అనుకోని పరిస్థితుల్లో.. మృత్యువాత పడ్డాడు. విదేశాల్లో కొద్ది రోజులు పనిచేసి అప్పులు తీర్చి కుటుంబభారాన్ని తగ్గించాలని భావించిన ఆ యువకుడి ఆశలను విధి ప్రమాదం రూపంలో నాశనం చేసింది. వెళ్లిన మూడు రోజులకే అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో అతడు మృతి చెందాడు.  శ్రీకాకుళానికి చెందిన ఆ యువకుడి విషాద మరణం గురించి కుటుంబ సభ్యులు స్థానికులు ఈ మేరకు వివరాలు తెలియజేశారు..

టి రవికుమార్ (35) శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలోని ఏం సున్నాపల్లి గ్రామానికి చెందిన యువకుడు. ఈనెల 17న మరో  పదిమందితో కలిసి నౌకలో పనిచేసేందుకు అమెరికాకు వెళ్ళాడు. అక్కడ సీమన్ గా మూడు రోజుల కిందటే ఉద్యోగంలో చేరాడు. ఉత్సాహంతో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం కూడా విధుల్లో భాగంగా కంటైనర్ మీద పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కంటైనర్ పైనుంచి జారిపడ్డాడు. దీంతో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. తిరుపతమ్మ ఆలయంలో చెలరేగిన మంటలు.. 20 దుకాణాలు దగ్ధం..

ఇది గమనించిన తోటి వారు యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు వచ్చి వెంటనే అతడిని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. దీంతో కంపెనీ ప్రతినిధులు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు రవికుమార్ కుటుంబ సభ్యులకు అతని మృతికి సంబంధించిన సమాచారాన్ని అందించారు. రవికుమార్ కు వివాహమయ్యింది. భార్య శ్రావణి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రవికుమార్ మృతదేహాన్ని తిరిగి ఇండియాకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని.. బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇదిలా ఉండగా, అగ్రరాజ్యం అమెరికాలో వరస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలో తెలుగు విద్యార్థులు మరణించడం విషాదాన్ని నింపుతుంది. వరుస తుపాకీ  మోతలతో కాలిఫోర్నియా రాష్ట్రం దద్దరిల్లిపోతుంది. కాలిఫోర్నియాలోని మాంటేరరి పార్కులో గత శనివారం జరిగిన విషాద ఘటన మరువకముందే..  బుధవారం మరోసారి కాల్పుల ఘటన అలజడి సృష్టించాయి.  ఈసారి ఉత్తర కాలిఫోర్నియా సమీపంలో ఉన్న హాఫ్ మూన్ బే నగరంలో కాల్పులు జరిగాయి. ఇక్కడి రెండు వ్యవసాయ వ్యాపార ప్రదేశాల్లో దుండగులు కాల్పులు జరపడంతో మొత్తం 14 మంది మరణించారు.

ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడిగా భావిస్తున్న చున్లీ జావ్ (67)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అంతకుముందు చికాగోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ తెలుగు విద్యార్థి మరణించాడు. చైనా లూనార్ కొత్త సంవత్సర వేడుకల్లో జరిగిన కాల్పుల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మరువకముందే కాలిఫోర్నియాలోని వేరువేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల ఘటనలు భయాందోళనకు గురిచేసాయి. ఈ ఘటనలో మొత్తం 14 మంది మృతి చెందారు.

ఉత్తర కాలిఫోర్నియాలోని ఆఫ్ మూన్ బే ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలోచున్లీ జావ్ (67) అనే ఓ చైనా జాతీయడైన వ్యవసాయ కార్మికుడు ఈ కాల్పులకు తెగబడ్డాడు. తోటి కార్మికులపై కాల్పులు జరిపాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోతూ మరోసారి కాల్పులు జరిపాడు. మరొకటనలో అయోగనగరంలోని డేస్ నైస్ లో దుండగుడి కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. అయోవా రాష్ట్రంలోని డెస్ మోయిన్ నగరంలో జరిగిన మరో కాల్పుల ఘటనలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

click me!