టీఆర్ఎస్-వైసీపీ పొత్తు..ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తాం: బొత్స

By sivanagaprasad kodatiFirst Published Jan 17, 2019, 1:33 PM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, 2014లో ఎన్నికలకు వెళ్లినట్లుగానే 2019లోనూ తాము ఒంటిరిగానే పోటీ చేస్తామని బొత్స స్పష్టం చేశారు.  రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అందుకోసం ఎంతవరకైనా వెళతామని బొత్స అన్నారు. 

తెలుగువారిని విడదీసిన కేసీఆర్‌తో ఎలా జతకడతారని, 10,11,13 షెడ్యూల్స్‌లో ఉన్న అంశాలను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్‌తో పాటు, అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్న ఆ పార్టీతో ఎలా కలుస్తారని టీడీపీ లేవనెత్తుతూ ప్రజల్లో అపోహలు కలిగిస్తోందని బొత్స అన్నారు.

టీఆర్ఎస్-వైసీపీ బొత్తుపై ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా రాష్ట్రాల హక్కుల కోసం కేసీఆర్ పోరాడుతున్నారని బొత్స వ్యాఖ్యానించారు. గడిచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించలేదా అని సత్యనారాయణ ప్రశ్నించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌తో పొత్తుపై చంద్రబాబు మాట్లాడిన పలు వీడియో క్లిప్పింగ్‌లను ఆయన మీడియాకు చూపించారు

click me!