
ప్రజా సంకల్ప యాత్రను వివరిస్తూ పోలీసు బాస్ కు వైసీపీ లేఖ రాసింది. ఈనెల 6వ తేదీ నుండి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయమై డిజిపి సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ, పాదయాత్రకు అనుమతి తీసుకోవాలంటూ చెప్పారు. డిజిపి వ్యాఖ్యలపై ముందు వైసీపీ నేతలు అభ్యంతరం చెప్పినా తర్వాత మెత్తబడ్డారు. అందుకనే జగన్ పిఎస్ కృష్ణమోహన్ రెడ్డి సోమవారం డిజిపికి లేఖ రాసారు. 6వ తేదీ నుండి మొదలవుతున్న జగన్ పాదయాత్ర గురించి వివరిస్తూ అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. పాదయాత్ర రూట్ మ్యాప్ జిల్లాల నేతలు లోకల్ పోలీసులకు అందచేస్తారని కూడా చెప్పారు. పాదయాత్ర ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఎక్కడ నుండి ప్రారంభమవుతోంది లాంటి వివరాలను లేఖలో ప్రస్తావించారు.