మరీ దారుణం.. ఈ జిల్లాల్లో ‘ఫ్యాన్’ గాలి వీయలేదుగా..!

Published : Jun 04, 2024, 09:43 PM IST
మరీ దారుణం.. ఈ జిల్లాల్లో ‘ఫ్యాన్’ గాలి వీయలేదుగా..!

సారాంశం

ఓటమి పాలైనా.. డబల్ డిజిట్ అయినా దక్కి ఉంటే ఆ పార్టీకి కాస్త మర్యాదగా ఉండేది కానీ... చిత్తు చిత్తుగా ఓడిపోవడం ప్రస్తుతం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు.

ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందా అని  అందరూ ఎదురు చూశారు. కొందరు టీడీపీ కూటమి గెలుస్తుందని.. కొందరు వైసీపీ గెలుస్తుందని పోటీలు కూడా పడ్డారు. అయితే.. విజయం ఎవరికి దక్కినా.. వార్ మాత్రం చాలా గట్టిగా ఉంటుందని.. టగ్ ఆఫ్ వార్ లాగా జరిగే అవకాశం ఉందని  అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. వార్ వన్ సైడ్ అయిపోయింది. మరీ దారుణంగా ప్రతిపక్ష పార్టీకి దక్కాల్సిన అన్ని సీట్లు కూడా దక్కలేదు. కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యింది. ఓటమి పాలైనా.. డబల్ డిజిట్ అయినా దక్కి ఉంటే ఆ పార్టీకి కాస్త మర్యాదగా ఉండేది కానీ... చిత్తు చిత్తుగా ఓడిపోవడం ప్రస్తుతం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు.

పార్టీకి చెందిన కీలక నేతలు అనుకున్నవారందరూ ఘోరంగా ఓడిపోయారు. ఇక కొన్ని జిల్లాల్లో అయితే.. కనీసం ఖాతాలు కూడా తెరవలేదు.  ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది జిల్లాల్లో  కనీసం ఖాతా తెరవలేదు. అంటే.. ఎనిమిది జిల్లాల్లో ఒక్కచోట కూడా ఒక్క వైసీపీ నేత  కూడా గెలవకపోవడం గమనార్హం.

కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒక్క స్థానాన్ని కూడా వైసీపీ గెలవలేకపోయింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి  గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్వీప్‌ చేయటం ఇదే తొలిసారి. ఈ వార్త.. ఆ పార్టీ నేతల్లో మరింత సంతోషాన్ని నింపింది. ఇక ఫ్యాన్ గాలి కాస్త ఎక్కువగా రాయలసీమలో మాత్రమే వీయడం గమనార్హం. అక్కడ మాత్రమే వైసీపీ తన సత్తా చాటగలిగింది. మిగిలిన చోట్ల.. ఫ్యాన్ కనీసం తిరగనే లేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RK Roja Celebrate Kanuma GoPuja: కనుమ సందర్బంగాగోపూజ నిర్వహించిన ఆర్కె రోజా| Asianet News Telugu
Kethireddy Pedda Reddy Pressmeet: ఎక్క‌డైనా చర్చకు సిద్ధం జేసీకి పెద్దారెడ్డి స‌వాల్| Asianet Telugu