Andhra Pradesh Assembly Election Result: ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయి. ఫలితాల అనంతరం కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించారు.
Andhra Pradesh Assembly Election Result: ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయి. ఫలితాల అనంతరం కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన నేపథ్యంలో జగన్ మాట్లాడుతూ.. అందరికీ మంచి చేసినా ఏమైందో తెలియట్లేదని భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే ఎన్నడూ చూడని విధంగా.. చేయని విధంగా మంచి చేశానని మళ్లీ అదే చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి కోట్ల మందికి లబ్ధి చేకూర్చినా తనకు ఓట్లు పడలేదన్నారు. వారి అభిమానం ఏమైందో.. గతంలో ఎప్పుడు చూడని విధంగా తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అందించిందన వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు. అసలు రైతన్న ప్రేమ ఏమైందో అని భావోద్వేగానికి లోనయ్యారు.
ఇడ్లీ షాపులు పెట్టుకున్నా.. చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్న అన్నదమ్ములకు అక్కచెల్లెలకు మంచి జరగాలని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని అన్నారు. ప్రతి కులానికి అండగా ఉంటూ వారికి చేదోడు వాడోగా ఉన్నామని అన్నారు. లక్షలాది మందికి ఎంత మంచి చేసినా ఫలితం లేకుండా పోయిందని భావోద్వేగానికి లోనయ్యారు. మేనిఫెస్టో అంటే ఒక చెత్త బుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదనీ, ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని భావించామనీ, తాను అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి మేనిఫేస్టోను అమలు చేశామని అన్నారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99% అములు చేశామని అన్నారు.
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం తీసుకవస్తే.. వ్యతిరేకించిన పేద పిల్లల అండగా నిలబడాలని, తోడుగా ఉండాలని భావించామని అన్నారు. అలాగే.. చరిత్రను మార్చాలని గ్రామస్థాయిలోనే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి.. ప్రతి ఇంటికి కరప్షన్ లేకుండా దాదాపుగా రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలను ఇంటి వద్దకు తీసుకవచ్చి అందించామని అన్నారు. పేదవాడికి అండగా నిలబడాలని, సాధికారత అంటే ఇదే అని ప్రపంచానికి చాటి చెప్పగలిగేలా సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగేలా ఎన్నో గొప్ప మార్పులు చేసామని అన్నారు. మరి కొట్లాది మంది అభిమానం ఏమైందో ? వారి ఆప్యాయతేమైందో? తెలియదని భావోద్వేగానికి లోనయ్యారు. ఏం జరిగిందో ..ఆ దేవుడికే తెలుసు.. పెద్దగా నేను చేసేదేమి లేదని అన్నారు. ప్రజల తీర్పును తాము గౌరవిస్తామని, ప్రజలకు తోడుగా కచ్చితంగా ఉంటామని, పేదవాడికి తోడుగా ఉంటూ గళం విప్పుతామని అన్నారు. కూటమిలో ఉన్న బిజెపికి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు.
తన ప్రతి కష్టంలో తోడుగా అండగా నిలబడిన ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్ కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెనర్ కు, తనకు తోడుగా నిలబడిన చెల్లెమ్మలకు అన్నదమ్ములకు మీ అందరికీ మనస్ఫూర్తిగా తాను కృతజ్ఞతలు తెలియజేస్తానని అన్నారు. ఏం జరిగిందో తెలియదు, గానీ ఏమి చేసినా ఎంత చేసినా.. 40 శాతం ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారని అన్నారు. ప్రతిపక్షంలో ఉండడం తనకు పోరాటాలేమి కాదని, తన రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిచిందని అన్నారు.