మేమంతా సిద్ధం: జగన్ బస్సు యాత్ర ప్రారంభం..

By Mahesh K  |  First Published Mar 27, 2024, 3:34 PM IST

వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ రోజు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు.
 


YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఈ యాత్ర సాగనున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం సీఎం జగన్ ఈ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి నుంచి ఇడుపుల పాయకు చేరుకున్న వైఎస్ జగన్.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు. వైఎస్ జగన్‌ను ఆశీర్వదించి ఈ బస్సు యాత్రకు తల్లి విజయమ్మ సాగనంపారు. యాత్రకు సిద్ధమైన బస్సులో వైఎస్ జగన్, వైఎస్ అవినాశ్ రెడ్డి, జగన్ రెడ్డి మేన మామా రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా వైసీపీ నాయకులు ఎక్కారు.

Latest Videos

ఈ రోజు కడప జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్ జగన్ ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డు సమీపంలో నిర్వహించతలపెట్టిన సభలో ప్రసంగిస్తారు. రాత్రికల్ల నంద్యాల జిల్లాకు చేరుకుంటారు. ఆళ్లగడ్ఢలో సీఎం జగన్ రాత్రి బస చేస్తారు.

click me!