పులివెందుల సీఎస్ఐ చర్చిలో జగన్ ప్రార్ధనలు

Siva Kodati |  
Published : May 29, 2019, 02:34 PM IST
పులివెందుల సీఎస్ఐ చర్చిలో జగన్ ప్రార్ధనలు

సారాంశం

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం కడప వెళ్లారు. 

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం కడప వెళ్లారు. కడపలోని పెద్ద దర్గాను సందర్శించారు.

తిరుమల నుంచి దర్గాకు చేరుకున్న ఆయనకు మతపెద్దలు ఘనస్వాగతం పలికారు. సాంప్రదాయ రీతిలో తలపాగా ధరించి... జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, చాదర్ సమర్పించారు.

అక్కడి నుంచి నేరుగా పులివెందులలోని సీఎస్ఐ చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. మత పెద్దలు సందేశం వినిపించి.. జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించారు. చర్చి కమిటీ సభ్యులు పూలమాల, శాలువాతో సత్కరించారు.

పులివెందులలో కాసేపు విశ్రాంతి అనంతరం జగన్ ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు. 

PREV
click me!

Recommended Stories

బిలాయి నుండివచ్చాం.. ఆంధ్రాకల్చర్ ని ఎంజాయ్ చేశాం:Visakhaలో Bhogi Celebrations | Asianet News Telugu
Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?