ఉత్కంఠకు తెర: దుగ్గిరాాల ఎంపీపీగా సంతోష రూపవాణి ఎన్నిక

By narsimha lode  |  First Published May 5, 2022, 3:19 PM IST

తీవ్ర ఉత్కంఠ రేపిన దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక గురువారం నాడు ముగిసింది. వైసీపీకి చెందిన చింతలపూడికి చెందిన సంతోష రూపవాణి ఎంపీపీగా ఎన్నికయ్యారు. టీడీపీ తరపున బీసీ అభ్యర్ధులు ఎవరూ లేకపోవడంతో వైసీపీకి చెందినరూపవాణి విజయం సాధించారు.


గుంటూరు: గుంటూరు జిల్లా Duggirala  ఎంపీపీగా YCP కి చెందిన సంతోష Rupavaniఎన్నికయ్యారు. దుగ్గిరాల MPP  పదవి BC Woman కు రిజర్వ్ అయింది. అయితే మండలంలో ఇద్దరు మాత్రమే బీసీ మహిళలు ఎంపీటీసీలుగా  విజయం సాధించారు. మండలంలోని చింతలపూడి నుండి సంతోష రూపవాణి, దుగ్గిరాల 2 స్థానంనుండి తాడిబోయిన పద్మావతి విజయం సాధించారు. వీరిద్దరూ కూడా వైసీపీ అభ్యర్ధులే.

గుంటూరు జిల్లాలోని  దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక ఇవాళ పూర్తైంది. గతంలో రెండు దఫాలు పలు కోరం లేక ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. దీంతో ఇవాళ ఎంపీపీ ఎన్నిక నిర్వహించాల్సి న అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. 

Latest Videos

undefined

గతంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో దుగ్గిరాల మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాల్లో TDP 9, YCP 8 స్థానాలు దక్కించుకొంది. ఒక్క స్థానంలో Janasena విజయం సాధించింది. అయితే టీడీపీకి జనసేన మద్దతును ప్రకటించింది.

దుగ్గిరాల ఎంపీపీ పదవిని షేక్ జబీన్ కు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. టీడీపీ నుండి బీసీ మహిళలు ఎవరూ కూడా విజయం సాధించలేదు. దుగ్గిరాల మండలంలోని చిలువూరు నుండి గెలుపొందిన  Shaik Jabinను ఎంపీపీ అభ్యర్ధిగా టీడీపీ ప్రకటించింది. జబీన్ కు కుల ధృవీకరణ పత్రం కోసం రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగారు.ఈ విషయమై కోర్టును కూడా టీడీపీ నేతలు ఆశ్రయించారు. ఎంపీపీ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది.  

జబీన్ కు కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెవిన్యూ  అధికారుల వల్ల న్యాయం జరగలేదని జబీన్ కలెక్టర్ వద్దకు వెళ్లింది. అయితే జబీన్ సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత ఆమెను బీసీ మహిళగా పరిగణించలేమని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో టీడీపీకి అభ్యర్ధి లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన దుగ్గిరాల 2 స్థానం నుండి విజయం సాధించిన తాడిబోయిన పద్మావతి కూడా ఎంపీపీ పదవిని ఆశించింది. దీంతో పద్మావతి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే టీడీపీ, జనసేనలు మద్దతును ప్రకటిస్తామని హామీ ఇచ్చాయి.

బుధవారం నాడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పద్మావతి ఇంటికి వచ్చారు. పద్మావతిని క్యాంప్ కి తీసుకెళ్లాలని కోరినట్టుగా పద్మావతి కొడుకు యోగేంద్రనాథ్ చెప్పారు. ఎమ్మెల్యే వెళ్లిపోయిన కొద్దిసేపటికే పద్మావతిని ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి మనుషులు కిడ్నాప్ చేశారని Yogendranath  ఆరోపించారు. ఎంపీపీ ఎన్నికకు పద్మావతి హాజరు కాకుండా ఉండేలా చేసేందుకే పద్మావతిని కిడ్నాప్ చేయించారని యోగేంద్రనాథ్ ఆరోపిస్తున్నారు. ఎంపీపీ ఎన్నిక సమయంలో ఇండిపెండెంట్ గా పద్మావతి పోటీ చేస్తే ఆమెకు టీడీపీ, జనసేనలు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నాయి. దీంతో పద్మావతిని ఎన్నికకు దూరంగా ఉంచాలనే వ్యూహాంలో భాగంగానే కిడ్నాప్ చేయించారని యోగేంద్రనాథ్ ఆరోపిస్తున్నారు.

ఎంపీపీ ఎన్నిక నిర్వహించడానికి ముందు కో ఆఫ్షన్ ఎన్నికను నిర్వహించారు. కో ఆప్షన్ సభ్యుడిగా టీడీపీ అభ్యర్ధి విజయం సాధించారు. ఎంపీపీ పదవికి సంతోష రూపవాణి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. మెజారిటీ ఉన్నా కూడా అభ్యర్ధి లేకపోవడంతో దుగ్గిరాల ఎంపీపీ పదవిని టీడీపీ కోల్పోవాల్సి వచ్చింది. 

click me!