నారాయణ, చైతన్య స్కూల్స్ నుంచే పేపర్ లీక్.. మహిళలపై దాడులకు పాల్పడింది టీడీపీ వారే: సీఎం జగన్

Published : May 05, 2022, 01:55 PM IST
నారాయణ, చైతన్య స్కూల్స్ నుంచే పేపర్ లీక్.. మహిళలపై దాడులకు పాల్పడింది టీడీపీ వారే: సీఎం జగన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తిరుపతిలో పర్యటించారు. ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. విద్యాదీవెన కింద సీఎం జగన్.. 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు బటన్‌ నొక్కి జమ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తిరుపతిలో పర్యటించారు. ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. విద్యాదీవెన కింద సీఎం జగన్.. 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు బటన్‌ నొక్కి జమ చేశారు. అంతకుముందు అక్కడి సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చదవు అనేది పిల్లలకు మనమిచ్చే ఆస్తి అని.. దానిని ఎవరూ దొంగతనం చేయలేరని అన్నారు. జగనన్న విద్యాదీవెన ఎంతో గొప్ప పథకం అని అన్నారు. గత ప్రభుత్వం అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు చదువులకు దూరం కావద్దన్నారు

తన పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు చూశానని చెప్పారు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పులు పాలైన పరిస్థితి చూశానని తెలిపారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి వచ్చిన మార్పును గమనించాలని కోరారు. గత ప్రభుత్వం గవర్నమెంట్ సౌకర్యాల గురించి ఎప్పుడైనా పట్టించుకుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏ రోజు కూడా ఇంగ్లీష్ మీడియం ఆలోచన చేయలేదన్నారు. 

ప్రభుత్వ బడులను మూసివేయాలనేదే చంద్రబాబు ఆలోచన అని విమర్శించారు. అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. నాడు-నేడు కార్యక్రమం చంద్రబాబు హయాంలో జరిగిందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పిల్లలు ఏం తింటున్నారనే విషయాన్ని అసలు పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వంలో విద్యాదీవెన వంటి పథకం అమలైందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం బకాయిలను కూడా తామే చెల్లించామని చెప్పారు. అవినీతికి తావులేకుండా నేరుగా అకౌంట్లలోకి డబ్బులు వేస్తున్నామని చెప్పారు. 

ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబుల దుష్టచతుష్టయం జీర్ణించుకోలేకపోతుందని మండిపడ్డారు. గ్లోబల్ ప్రచారంలో భాగంగా నలుగురు ఒకే  అబద్దం చెప్పిందే చెప్పి.. అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నిజాలు ఏమిటో ప్రజలందరికీ తెలుసన్నారు. గుడులు ధ్వంసం చేస్తే గుడులు కట్టామని.. విగ్రహాలు ధ్వంసం చేస్తే మళ్లీ పెట్టించామని.. రథాలు తగలబెడితే మళ్లీ నిర్మించామని.. రైతులను కుంగదీస్తే మళ్లీ నిలబెడతున్నామని చెప్పారు. మన పిల్లలను, పల్లెలను దెబ్బతీస్తే.. ఈ రోజు ప్రతి పల్లెలో ప్రజల వద్దకే సుపరిపాలన తీసుకొచ్చే విధంగా దేశానికి  మార్గనిర్దేశనం చేశామని చెప్పారు. బడులను, ఆస్పత్రులను శిథిలావస్థకు తీసుకొస్తే.. నాడు-నేడు తీసుకొస్తే వాటిని నిలబెడుతున్నామని తెలిపారు. పేద పిల్లలు ఎదగకూడదని తెలుగు మీడియం ఉంచాలని చూస్తే.. వారు ఎన్ని ఆటంకాలు తెచ్చిన ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చామని చెప్పారు. 

ఎన్నికల వేళ వారు ఇష్టానుసారం మాటలు చెబుతారు.. కానీ అధికారంలో వచ్చాక మాత్రం వాటిని నెరవేర్చరని విమర్శించారు. ఎన్నికల తర్వాత మేనిఫెస్టో అనేది కనిపించకుండా చేస్తారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలోనే బలహీనవర్గాలను, అగ్రవర్ణాల్లోని పేదలను వాడుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వం 35 నెలల కాలంలో 1,38, 894 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొప్పి అక్కాచెల్లమ్మల ఖాతాల్లోకి పంపించిందని చెప్పారు. వివక్షకు, లంచాలకు తావులేకుండా మంచి జరుగుతుందని చెప్పారు. 

జరిగిన మేలు ప్రస్పుటంగా కనిపిస్తుందని.. కానీ చంద్రబాబుకు, ఆయన మోస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు కడుపు మంట పెరుగుతుందన్నారు. అబద్దాల మీద అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేపర్ లీక్‌లతో  వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లే వ్యవస్థను నాశనం చేసి.. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

రెండు నారాయణ, మూడు చైతన్య స్కూళ్ల నుంచే పేపర్ లీకులు అయ్యాయని చెప్పారు. ఇదే నారాయణ చంద్రబాబు హయాంలో మంత్రిగా ఉన్నారని తెలిపారు. ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి వాట్సాప్‌లో షేర్ చేస్తున్నారని తెలిపారు. లీకులు జరిగాయని మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగనన్న విద్యాదీవెనకు మంచి పేరు వస్తుందనే ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారని విమర్శించారు. 

ఎల్లో మీడియా గుంటనక్కలకన్నా హీనంగా ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి పోకుండా చేస్తుందని మండిపడ్డారు. అత్యాచారాలు అంటూ కొత్తగా ప్రచారం మొదలుపెట్టారు. విశాఖ, విజయవాడ, గుంటూరులో ఏదో జరిగిందని నానా యాగీ చేశారని చెప్పారు. మహిళలు, పిల్లలపై అత్యాచార ఘటనల్లో నిందితు ఎవరనేది ఎల్లో మీడియా చెప్పదని అన్నారు. ఎందుకంటే దాడులకు పాల్పడినవారంతా టీడీపీ వారేనని ఆరోపించారు. మహిళ సాధికారత, రక్షణ కోసం.. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ముందుకు అడుగులు వేస్తున్నామని చెప్పారు. మహిళల మీద నేరాలు జరగకుండా చూసేందుకు దిశ యాప్‌ను తీసుకొచ్చామని చెప్పారు. ఇన్నీ జాగ్రత్తలు తీసుకున్న కూడా దోషులు ఎవరైనా కూడా నిర్దాక్షిణ్యంగా చట్టాన్ని ప్రయోగిస్తున్నామని  చెప్పారు. వైఫల్యాలు ఉంటే పోలీసులు అయినా సరే, ప్రభుత్వ ఉద్యోగులైన సరే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎల్లో మీడియా నుంచి, ఎల్లో పార్టీని మా రాష్ట్రాన్ని రక్షించు దేవ అని తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sajjala Ramakrishna Reddy Explains | YSRCP One Crore Signatures Campaign | Asianet News Telugu
YS Jagan Flags Off Vehicles to Lok Bhavan | Crore Signatures Paper Transfer | Asianet News Telugu