జగన్ ఆపరేషన్ ఆకర్ష్.. మరో టీడీపీ ఎమ్మెల్యేకి గాలం

Published : Feb 18, 2019, 02:53 PM ISTUpdated : Feb 18, 2019, 02:55 PM IST
జగన్ ఆపరేషన్ ఆకర్ష్.. మరో టీడీపీ ఎమ్మెల్యేకి గాలం

సారాంశం

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. వైసీపీ తన బలం పెంచుకునేందుకు కృషి చేస్తోంది. 

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. వైసీపీ తన బలం పెంచుకునేందుకు కృషి చేస్తోంది. గత ఎన్నికల తర్వాత.. వైసీపీ నుంచి 20కిపైగా ఎమ్మెల్యేలను ఆకర్ష్ పేరిట టీడీపీ తన పార్టీలో చేర్చుకుంది. అందులో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. కాగా.. మళ్లీ ఎన్నికలు దగ్గరపడే సమయానికి అదే ఆకర్ష్ మంత్ర వైసీపీ ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఇద్దరు ఎంపీలు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా.. మరో ఎమ్మెల్యేకి వైసీపీ గాలం వేసినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేతో వైసీపీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే.. వైసీపీలో చేరేందుకు ఆ ఎమ్మెల్యే ఓ కండిషన్ పెట్టారట.

పార్టీలో చేరినందుకు తనతోపాటు తన కుమారుడికి కూడా టికెట్ ఇవ్వాలని కోరాడట. అయితే.. రెండు టికెట్లు అంటే కష్టం.. ఒక టికెట్ అయితే ఇస్తామని వైసీపీ నేతలు చెప్పారట. ప్రస్తుతం చర్చలు జరుగుతన్నాయి. సఫలమైతే.. టీడీపీ నుంచి మరో వికెట్ డౌన్ అయినట్టే. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో తెలియాలన్నా కూడా.. మరో రెండు మూడు రోజులు ఎదురుచూడాల్సిందే. 

PREV
click me!

Recommended Stories

Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu
CM Chandrababu Naidu: అధికారం దుర్వినియోగం చేసేవారిపై బాబు సీరియస్| Asianet News Telugu