ఇంట్రెస్టింగ్..జగన్ ని కలిసిన జూ.ఎన్టీఆర్ మామ

Published : Feb 18, 2019, 02:11 PM IST
ఇంట్రెస్టింగ్..జగన్ ని కలిసిన జూ.ఎన్టీఆర్ మామ

సారాంశం

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కీలక నేతలు అనుకున్నవారంతా.. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. 

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కీలక నేతలు అనుకున్నవారంతా.. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎంపీలు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులను కలవరపాటుకు గురి చేసింది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీ  అధినేత జగన్‌ను కలిశారు. జగన్‌తో నార్నె భేటీ ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మర్యాదపూర్వకంగానే జగన్‌తో భేటీ అయినట్లు నార్నె శ్రీనివాసరావు చెబుతున్నప్పటికీ.. వీరి భేటీ ప్రస్తుతం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు.. ఎన్టీఆర్ ని వాడుకొని ఆ తర్వాత దూరం పెట్టేశాడు. ఈ క్రమంలోనే నార్నె.. టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా.. ఆయన వైసీపీలో చేరుతున్నారేమో అనే అనుమానం కలుగుతోంది. 

 నార్నె.. జగన్‌ను ఎందుకు కలిశారు.. ఆయనతో ఏం మాట్లాడారు.. రాజకీయ అంశాల గురించి ముచ్చటించారా.. అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. టీడీపీలోనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu